సోషల్ మీడియాపై నియంత్రణకు కేంద్రం ఎత్తులు?
Students Protest
నీట్ పేపర్ లీకేజీ ఉద్యమంలో వాస్తవాలను ప్రజలకు చేర్చడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ప్రధానంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వా రా తమ నిరసనలను సృజనాత్మకంగా, జూలై 20న పోలీసుల దమనకాండ దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా ప్రపంచం ముందుంచింది. అలాంటి సోషల్ మీడియాను పరోక్షంగా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డదోవన పన్నాగాలు పన్నుతున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కేంద్ర విద్యా మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత జూలై 28న ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియో సందేశాన్ని ఆయన ఫేస్ బుక్ ఖాతాలో కొంత సేపు నిలిపివేశారు. దీనిపై ప్రభుత్వ వర్గాలు సోషల్ మీడియా యజమా ని అయిన ‘మెటా’ సంస్థను ప్రశ్నించటంతో సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగిందని ఐదు గంటల తరువాత ఆ వీడియోను పునరుద్ధరించారు. అయితే, అప్పటికే ఆ వీడియో ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రజలకైతే చేరిం ప్రభుత్వ పెద్దలు అంతటితో ఆగలేదు. జంతర్ మంతర్ ఉద్యమం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడంలో సోషల్ మీడియానే ప్రధాన భూమిక పోషించిన విషయం వారి మదిలో మెరమెర అంటూనే ఉంది. అందుకే ప్రధాని వీడియోను ఆపేశారనే సాకుతో ఎలాగైనా సోషల్ మీడియా యాజమాన్యాలను లొంగదీసుకోవాలనే తలంపుకొచ్చినట్లు అర్థమవుతోంది.ప్రధాని ప్రసంగ వీడి నిలిపివేత నేపథ్యంలో మెటా, గూగుల్, యూట్యూబ్, స్నాప్ తదితర సో మీడియా వేదికల నిర్వాకులకు బిజెపి ఎంపి నిశికాంత్ దూబే నేతృత్వంలో కమ్యూనికేషన్స్, ఐటి పార్లమెంటరీ స్థాయీ సంఘం సోమవారం నాడు స మన్లు జారీ చేసింది. ఇదే స్థాయీ సంఘ సభ్యుడైన కాంగ్రెస్ ఎంపి షఫి పరంబిల్ సాంకేతికతను నియంత్రించాలే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాదని తన వాదనను స్పష్టంగా వినిపించారు. రాజకీయ ఒత్తిళ్ళకు అనుగుణంగా లేదా చట్టబద్ధమైన అసమ్మతిని నేరపూరితం చేయటం ద్వారా విషయాన్ని(కంటెట్‌ను) ని యంత్రించవద్దని నొక్కి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ, ప్రభు త్వం పంతం వీడలేదు. మూడు రోజుల లోగా ‘మెటా’ ఛీఫ్ మార్క్ జ్యూకర్బెర్గ్ క్షమాపణ చెప్పాలని, లేదంటే థర్ట్ పార్టీ కంటెంట్ విషయంలో మెటాకు కల్పించిన చట్టపరమైన రక్షణలు తొలగిస్తామని స్థాయీ సంఘం చైర్మన్ నిశికాంత్ దూబే హెచ్చరికలు జారీ చేశారు. ఇదంతా జరుగుతుండగానే గ్లోబల్ అఫైర్స్ జోయెల్ కప్లన్ నేతృత్వంలోని ‘మెటా’ప్రతినిధి బృందం మంగ బుధవారాలలో ప్రభుత్వ అధికారులు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వివరణిచ్చుకుంది. మెటా తరుఫున క్షమాపణను తెలియజేసింది. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో జంతర్‌మంతర్ నిరసనలకు ఇన్స్టాగ్రామ్ పెద్ద ఎత్తున ప్రాధాన్యతనివ్వడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
‘మెటా’నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో లోతుగా పరిశీలిస్తే అర్థమవుతోంది. జెన్ జీ తరం ఎక్కువగా వినియోగించే ‘ఇన్స్టాగ్రామ్’, వాట్సాప్, ఫేస్బుక్ తదితర యాప్‌లకు యజమాని ‘మెటా’నే కావడం విశేషం. భారతదేశం లో వాట్సాప్‌ను సుమారు 57 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌ను 48 కోట్లు, ఫేస్‌బుక్‌ను 40 కోట్లకుపైగా వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక సోషల్ మీడియా వినియోగదారులు కలిగిన ‘మెటా’ను అందుకే ఎంచుకున్నా రు. సోషల్ మీడియా సంస్థలను లొంగదీసుకొని, పరోక్ష పద్ధతిలో అసమ్మతి, నిరసనలను ప్రజలకు చేరకుండా పాలకులు పరోక్షంగా గొంతునొక్కే ప్రయ త్నం కనపడుతున్నది. అయితే, హైదరాబాద్‌లో మెటా సంస్థపై నమోదైన కేసు ను కేంద్ర ప్రభుత్వం ఆసరా తీసుకోవడం గమనార్హం. ఆ కేసును నమోదు చేసి న పోలీసు అధికారి బదిలీ అవడం, దానిపై కాంగ్రెస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం సాగుతుండడం వేరే విషయం. నిజానికి సోషల్ మీడియాపైనే యువ ఆధారపడడానికి అసలు కారణం ప్రధాన స్రవంతి మీడియా వైఫల్యాన్ని జంతర్‌మంతర్ ఉద్యమం ఎత్తిచూపుతున్నది. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా దాదాపు నెల రోజులు పార్లమెంటు సమీపంలో నిరసన, నిరశనలు చేపట్టినా ప్రభుత్వం అహంకారపూరిత మొండి పట్టుదలకు పోయింది. పరాకాష్ఠగా జూలై 20న ‘సంసద్ చలో’కు దేశమంతటి నుంచి తరలివచ్చిన వచ్చిన యువతీయువకులపై కేంద్రం ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు, బలగాలు పైశాచికంగా విరుచుకుపడిన తీరు దేశ స్మృతిపథం నుంచి ఇంకా చెరిగిపోలేదు. అణిచివేస్తే తోకముడుస్తారనుకున్న యువత అంతే పట్టుదలతో కేంద్రంపై శాంతియుత ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో దిగొచ్చి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే, ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ మీడియా వ్యవహరించిన తీ తీవ్ర విమర్శలకు గురైంది. యువత ఆందోళనను చూపకుండా, నెల రోజు కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రవచనాలనే వల్లిస్తూ, జంతర్‌మంతర్ వైపు కన్నెత్తి చూడలేదు. యువతపై పోలీసుల అమానుష దాడి జరిగిన దృశ్యాలు కూడా చూపక, ఉల్టా పోలీసులపైనే వారు దాడి చేశారంటూ ప్రసారాలు చేయడం యువత ఆగ్రహాన్ని మరింత పెంచింది. ప్రధాన స్రవంతి మీడియా విస్మరించినప్పటికీ, జంతర్‌మంతర్ నిరసన, నిరశనలో ఉన్న సోనమ్ వాంగ్చుక్ను మార్బలంతో అక్రమ తరలింపు, అన్నిటికి మించి జూలై 20న యువత, ప్రత్యేకించి యువతులపై పోలీసులు, కేంద్ర బలగాల దాష్టీకాన్ని దేశ ప్రజలకు చేర్చడంలో జెన్ జీ యువత సఫలీకృతమైంది. ఇందుకు ఇన్స్టాగ్రామ్, యూట్యూ బ్, స్నాప్ చాట్లు ఆసరా అయ్యాయి. ఇంత జరిగినా కేంద్ర ప్రభుత్వ తీరు మారలేదు. రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ను మరుసటి రోజే పార్లమెంటు ప్రాంగణంలో తలపాగా పెట్టి, దండలు వేసి మరీ బిజెపి ఎంపిలు స్వాగతం పలికారు. యువతపై కేసుల పరంపరను కొనసాగించారు. చీకటి గదిలో పెట్టి కొడితే పిల్లునా తిరగబడుతోందనేది లోకోక్తి. ఇప్పటికే ‘సంసద్ చలో’లో బాష్పవాయువులు, లాఠీల దెబ్బలతో తమ భయం పోయిందని యువత గర్వంగా చెప్పకుంటోంది. అయినప్పటికీ, గుణపాఠం నేర్వని పాలకులు అసమ్మతి వినిపించేందుకు ఉన్న కొద్ది అవకాశాలను సైతం కాలరాసే కుతంత్రాలు సాగించ టం నిరంకుశత్వానికి పరాకాష్ఠ. ప్రజాస్వామ్యానికి భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్ర తిపక్షం, అసమ్మతి, నిరసనలు ప్రాణవాయువు వంటివి. వాటిని తొక్కిపెట్టిన భయంకరమైన నియంతలు కాలగర్భంలో కలిసిపోయినట్లు చరిత్ర చెబుతోంది.