Skip to content
వినోదం వార్తలు

350+ మిలియన్ల వ్యూస్‌తో ‘రామాయణ’ ట్రెండింగ్

Prajapaksham 03 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
350+ మిలియన్ల వ్యూస్‌తో ‘రామాయణ’ ట్రెండింగ్

Ramayana

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే అధికారిక ప్లాట్‌ ఫార్మ్‌లలో 350 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ విఎఫెక్స్ , భావోద్వేగభరితమైన కథనం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా “అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ” అనే ట్యాగ్ పెట్టారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ శక్తివంతమైన నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా యష్ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సీతగా సాయి పల్లవి తన హుందాతనం, అమాయకత్వం, భావోద్వేగాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ‘రామాయణ: పార్ట్ 1’ పై అంచనాలు మరింత పెరిగాయి.కేవలం రెండు రోజుల్లో 350 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ‘రామాయణ’ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ , డీఎన్‌ఈజీ, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోనీ పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.