CJP విద్యార్థి ఉద్యమానికి గ్రెటా థన్‌బెర్గ్ మద్దతు…SFI UK విజయోత్సవ సభలో సంచలన వ్యాఖ్యలు
CJP విద్యార్థి ఉద్యమానికి గ్రెటా థన్‌బెర్గ్ మద్దతు…ప్రజాశక్తికి అసలైన అర్థం ప్రపంచానికి చాటి చెప్పిన భారతీయ జెన్ జీ
దేశంలో విద్యారంగంలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతృత్వంలో భారతీయ విద్యార్థులు చేపట్టిన చారిత్రాత్మక నిరసనలకు అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పర్యావరణ వేత్త గ్రెటా థన్‌బెర్గ్ ఈ ఉద్యమానికి తన పూర్తి మద్దతు ప్రకటించారు. విద్యార్థులు సాగించిన ఈ సుదీర్ఘ పోరాటం “ప్రజాశక్తి (People Power) అసలైన అర్థాన్ని” ప్రపంచానికి చాటిచెప్పిందని ఆమె కొనియాడారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్ పోర్టల్ ఒక వార్తా కథనంలో రిపోర్టు చేసింది.
లండన్‌లో ‘స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (SFI – UK) శనివారం నిర్వహించిన ఒక సభలో గ్రెటా థన్‌బెర్గ్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. “భారతీయ విద్యార్థుల పోరాటం మనందరికీ గర్వకారణం. ప్రజా సమైక్యతకు, నిరసన తె తెలిపే శక్తికి వారు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారు. న్యాయం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం భారతీయ విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటం కేవలం వారిది మాత్రమే కాదు… మనందరిదీ. అందుకే అంతర్జాతీయ సమాజం వారితో కలసి నిలబడాలి” అని గ్రెటా పిలుపునిచ్చారు.
నీట్ పత్రాల లీకేజీ కుంభకోణానికి నిరసనగా జూన్ 20న ‘సిజెపి’ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఉద్యమం ఏకంగా 36 రోజుల పాటు నిరంతరాయంగా సాగింది. జూలై 20న నిరసనకారులపై పోలీసులు సాగించిన లాఠీఛార్జ్‌తో ఈ ఉద్యమం మరింత ఉధృతమైంది. ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ సైతం విద్యార్థులకు మద్దతుగా సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు.దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలల ధాటికి తలొగ్గిన కేంద్ర విద్యుత్, విద్యారంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఉద్యమ విజయాన్ని పురస్కరించుకుని లండన్‌లో వేడుకలు నిర్వహించిన SFI UK ఒక ప్రకటన విడుదల చేసింది. “కేంద్ర మంత్రి రాజీనామా చేసేలా విద్యార్థి ఉద్యమం సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. అయితే ఈ పోరాటం ఇక్కడితో ముగిసిపోలేదు. నీట్ అక్రమాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 21 మంది విద్యార్థులకు, పోలీసుల అణచివేతకు గురైన బాధితులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేసింది.