Skip to content
వినోదం వార్తలు

ఆగస్ట్ 1న ‘రక్త చరిత్ర 2’ రీ రిలీజ్

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం వినోదం
ఆగస్ట్ 1న ‘రక్త చరిత్ర 2’ రీ రిలీజ్

ఆగస్ట్ 1న 'రక్త చరిత్ర 2' రీ రిలీజ్

ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ధ శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులకు చెందిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ గతంలో ‘రక్త చరిత్ర’ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటీనటులు తమ, తమ పాత్రలలో ఒదిగిపోయిన విధానం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ , అప్పట్లో ఆయన ఉపయోగించిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ చిత్రాలకు ఆయువు పట్టుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు ఒకే ఏడాది అనగా 2010లో వరుసగా విడుదలైయాయి. 16 ఏళ్ల తర్వాత ‘రక్త చరిత్ర’ పార్ట్-1 చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ చేయగా…హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మంచి స్పందన రావడంతో ఇప్పుడు ‘రక్త చరిత్ర’ పార్ట్-2 చిత్రాన్ని ఆగస్ట్ 1న థియేటర్స్ లో రీ రిలీజ్ చేయబోతున్నారు.

వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర అంటూ సాగే నేపథ్య గీతంతో పాటు కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం అనే మరో పాటతో కలుపుకుని కథానుసారం సందర్భానుసారమైన రెండు పాటలు ఉన్నాయి. నేటితరం యూత్ కు కూడా వాస్తవిక కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో రామ్ గోపాల్ వర్మ రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ‘రక్త చరిత్ర’ పార్ట్-2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వంకాయపాటి మురళీకృష్ణ, నట్టి లక్ష్మి కరుణ, నట్టి క్రాంతి నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.