Skip to content
జాతీయం వార్తలు

Vivek Tankha: సోనం వాంగ్చుక్‌కు ఏదైనా జరిగితే ఎంపీగా కొనసాగను.. కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్ఖా సంచలన వ్యాఖ్యలు

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Vivek Tankha: సోనం వాంగ్చుక్‌కు ఏదైనా జరిగితే ఎంపీగా కొనసాగను.. కాంగ్రెస్ ఎంపీ వివేక్ తన్ఖా సంచలన వ్యాఖ్యలు

Congress MP Vivek Tankha Says He Won't Remain an MP If Sonam Wangchuk Is Harmed

Vivek Tankha: నీట్ అభ్యర్థుల న్యాయం కోసం సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆసుపత్రి నుంచే చేపడుతున్న నిరాహార దీక్ష తీవ్ర రూపం దాల్చుతోంది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆయన అక్కడి నుంచే తన దీక్షను కొనసాగిస్తున్నారు. జంతర్ మంతర్ నిరసన ప్రాంతాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన పరిపాలనా యంత్రాంగానికి లేఖ కూడా రాశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది వివేక్ తన్ఖా ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేశారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షను ముగించేలా చూడటం పార్లమెంట్, ప్రభుత్వం, న్యాయవ్యవస్థల సమిష్టి బాధ్యత అని, ఒకవేళ ఆయనకు ఏమైనా హాని జరిగితే అది మనందరి వైఫల్యమే అవుతుందని స్పష్టం చేశారు. అలా జరిగితే తాను ఎంపీ పదవిలో కొనసాగడానికి ఇష్టపడనని వివేక్ తంఖా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (బొద్దింక జనతా పార్టీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు వివిధ ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలపడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. నీట్ పేపర్ లీక్‌పై సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు, ఈ అక్రమాలు, ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.