Skip to content
తెలంగాణ వార్తలు

Viral Video: తండ్రి 50వ పుట్టినరోజున కూతురు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్.. భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Prajapaksham 18 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Viral Video: తండ్రి 50వ పుట్టినరోజున కూతురు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్.. భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Viral Video: తండ్రి 50వ పుట్టినరోజున కూతురు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్:..భావోద్వేగం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Viral Video:జీవితాంతం కుటుంబం కోసమే త్యాగం చేసిన ఒక తండ్రికి.. కూతురు ఆయన 50వ పుట్టినరోజున ఇచ్చిన ఊహించని బహుమతి అందరినీ కదిలిస్తోంది. తన కలల బైక్‌ను కళ్లముందు చూసిన ఆ తండ్రి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న హృద్యమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తెలంగాణకు చెందిన నందిని కావేరి అనే యువతి తన తండ్రి పుట్టినరోజును చిరస్మరణీయంగా మార్చాలని కొన్ని వారాలుగా ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. పుట్టినరోజునాడు మొదట ఆమె తండ్రికి వీడియో కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆయనను ఇంటి బయటకు తీసుకువచ్చి, బట్టతో కప్పి ఉంచిన ఒక పెద్ద వస్తువును చూపించారు. ఏముందా అని ఆసక్తిగా ఆ వస్త్రాన్ని తొలగించిన తండ్రికి, అక్కడ తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్న కొత్త మోటార్‌సైకిల్ కనిపించింది. దాన్ని చూడగానే ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై.. భార్య, పిల్లలను ఆలింగనం చేసుకున్నారు.

ఈ అపురూప క్షణాల వీడియోను నందిని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ రాసింది. మా నాన్న తన జీవితాంతం మా కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చారు, మా కోసం ఎన్నో చేశారు కానీ తన కోసం ఏనాడూ ఏమీ అడగలేదు. ఆయన త్యాగాలకు, నాపై ఉంచిన నమ్మకానికి ఇది ఒక చిన్న కృతజ్ఞత మాత్రమే” అని పేర్కొంది. ఈ సర్‌ప్రైజ్‌ను రహస్యంగా ఉంచడంలో సహాయం చేసిన తన తల్లికి, సోదరుడికి కూడా ఆమె ధన్యవాదాలు తెలిపింది.

https://twitter.com/hazzureddy007/status/2078372882347098546?s=20

ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తండ్రి కళ్లలోని ఆనందభాష్పాలు ఆయన చేసిన ఏళ్ల త్యాగానికి ప్రతిరూపమని.. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ఇలాగే సంతోషపెట్టే స్థాయికి ఎదగాలని కామెంట్లు పెడుతున్నారు. తల్లిదండ్రుల నిస్వార్థ ప్రేమకు పిల్లలు ఇచ్చే గుర్తింపు ఎంత విలువైనదో ఈ వీడియో నిరూపిస్తోందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.