Skip to content
తెలంగాణ వార్తలు

Viral Video: శ్రీశైలం–హైదరాబాద్ హైవే పై పెద్దపులి సంచారం…ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరికలు..

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Viral Video: శ్రీశైలం–హైదరాబాద్ హైవే పై పెద్దపులి సంచారం…ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరికలు..

శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం

అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా కూడా పులికి ఉన్న రాజసం మరి ఏ జంతువుకు ఉండదు అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో పులుల సంచారం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా పులుల సంతతి పెరగడంతో పాటు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు లక్ష్యం కూడా నెరవేరుతోంది. తాజాగా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన పెద్దపులి రోడ్డు దాటుతూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మున్ననూరు నుంచి శ్రీశైలం. హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు రోడ్డుపై సంచరిస్తూ కనిపించిన పెద్దపులిని చూసి ప్రయాణికులు,పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో దృశ్యాలను చిత్రీకరించారు. అయితే పెద్దపులి సంచారం జరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ ఏర్పాటుచేసిన బోర్డులను చూసి జాగ్రత్తలను పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అటవీ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నం చేయొద్దు అని హెచ్చరిస్తున్నారు. పులుల సంచారం ప్రకృతిలో సహజ సిద్ధం అయినప్పటికీ కూడా మానవులు పులులు తారసపడినప్పుడు, ప్రమాదకరమైనటువంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని. కనుక శ్రీశైలం హైవేపై వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు..

ట్యాగ్‌లు: viral news