Telangana Assembly Speaker Video: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగం వీడియో వైరల్.. తాతా మధు అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
Telangana Assembly Speaker Video
Telangana Assembly Speaker Video: తెలంగాణ శాసనసభలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర మనస్తాపం చెంది, సభలోనే భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ పట్ల ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరుపై సభలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనికి సంబంధించిన వీడియోను సీఎంవో విడుదల చేయడంతో వివాదం మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు సంఘీభావం తెలిపేందుకు మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఆయనను కలిసి అండగా నిలిచారు. ఈ తీవ్ర పరిణామాల క్రమంలో తాతా మధుపై కఠిన చర్యలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిద్ధమవుతున్నారని, ఆయనను సభ నుంచి బహిష్కరించే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
స్పీకర్ పట్ల జరిగిన అవమానాన్ని తలచుకుని శాసనసభలో మంత్రి సీతక్క కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలు స్పీకర్‌ను ఉద్దేశించి అత్యంత దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను ‘అధ్యక్షా’ అని పిలవడం ఇష్టం లేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో దొరల అహంకారం, ఆధిపత్య భావజాలం స్పష్టంగా కనిపిస్తున్నాయని, అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయడంతో పాటు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సభకు వచ్చి క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.
మరోవైపు, బిజెపి శాసనసభా పక్ష నేత (ఏలేటి మహేశ్వర్ రెడ్డి) కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో స్పీకర్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాతా మధు అలాంటి అనుచిత పదజాలం ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు. బిజెపి ఎమ్మెల్యేలమంతా ఈ వ్యాఖ్యలను ముక్తకంఠంతో నిరసిస్తున్నామని తెలిపారు. తాతా మధు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారా లేక వెనుక నుండి ఎవరైనా మాట్లాడించారా అని ప్రశ్నించిన ఆయన, వెంటనే తాతా మధును పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఈ అంశంపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.
- Amit Shah VS Abhijit Dipke: 2029లో గెలుపుపై ముందే ధీమానా? అమిత్ షా మాటల్లోనే దొంగతనం బయటపడింది..దిప్కే కౌంటర్..
- Rahul Gandhi Petition: రాహుల్ గాంధీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా.. 14 లోపాలు గుర్తించిన రిజిస్ట్రీ
- Mamata Banerjee: మమతా బెనర్జీ నివాసం వద్ద కత్తితో మహిళ హల్చల్.. దాడికి యత్నించిందని టీఎంసీ ఎంపీ ఫిర్యాదు
- LB Nagar Double Decker Corridor: ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. హైదరాబాద్‌కు మరో కీలక ప్రాజెక్టు!
- CM Revanth Reddy: సీఎం రేవంత్ లాజిక్ కు బీజేపీ షాక్: జనాభా పెరుగుతుంటే.. 13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి?