Skip to content
తెలంగాణ వార్తలు

Viral Video: సీజేపీ ఆందోళనలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..

Prajapaksham 26 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Viral Video: సీజేపీ ఆందోళనలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..

సీజేపీ ఆందోళనలపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఎట్టకేలకు విజయవంతం అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ మొదటి విజయం సాధించింది. అయితే దీనిపై పలు రాజకీయ వర్గాల నుంచి స్పందనలు వస్తున్నాయి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు సీజెపి చేసిన సాహసం పైన ప్రశంసల వర్షం కురిపిస్తుంటే బిజెపి నేతలు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా జత అయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీ వారిపైన కేంద్ర ప్రభుత్వం దయ చూపించిందని అందుకే కేవలం లాఠీచార్జి చేసి మాత్రమే వదిలేసిందని, అదే అమెరికా లాంటి విదేశాల్లో జెన్జీ ఉద్యమం జరిగి ఉంటే షూట్ చేసి పారేసే వారిని వ్యాఖ్యలు చేశారు. అయితే యువతను కాల్చి చంపనందుకు మోడీ ప్రభుత్వం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలనే అర్థం వచ్చేలా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్యాగ్‌లు: BJP CJP political news