Jubilee Hills CI Muthu Yadav Suspended: జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్.. అసలు కారణమేంటి..
Jubilee Hills CI Muthu Yadav Suspended
Jubilee Hills CI Muthu Yadav Suspended: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు తీవ్ర చర్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ముత్తు యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ముత్తు యాదవ్.. ఈ కేసు నమోదు (ఎఫ్‌ఐఆర్) చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారని, నిందితుడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఈ వేటు పడింది.
గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని సుమంత్ కార్యాలయానికి చెంగిచెర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను ఒక ఆర్థిక వ్యవహారం మాట్లాడేందుకు సుమంత్ సహచరుడు రాము పిలిపించాడు. అక్కడికి చేరుకున్న హరికృష్ణపై సుమంత్‌తో పాటు అతని అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి, రాము తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇనుపరాడుతో అతడిపై కిరాతకంగా దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదు కాగానే విషయం తెలుసుకున్న సుమంత్ తన మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు.
పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమంత్ కోసం పోలీసులు గాలింపు వేగవంతం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు ప్రత్యేకంగా మూడు బృందాలను, అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు మరొక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రోజున సుమంత్ డ్రైవర్ నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
- మహిళా విముక్తి కోసం ముక్కోణ పోరాటం
- Nobel Peace Prize 2026 Navi Pillay: బస్సు డ్రైవర్ కుమార్తె నుంచి నోబెల్ శాంతి బహుమతి విజేతగా…
- Bathukamma Wishes in Telugu: బతుకమ్మ పండగ రెండో రోజు అటుకుల బతుకమ్మ సందర్భంగా Whatsapp Status గ్రీటింగ్స్ మీ కోసం..
- Navratri 2026: నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారి అవతారం.. చంద్రఘంటా దేవి మహిమ, పూజా విధానం ప్రత్యేకతలు!
- Supreme Court: ఢిల్లీ నిరసనలపై ఆంక్షలు.. పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ