Skip to content
తెలంగాణ › వార్తలు

Agri Gold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు తిరిగి సొమ్ము ఇప్పించే బాధ్యత ప్రభుత్వాలదే: సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

jagan 07 Oct 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Agri Gold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు తిరిగి సొమ్ము ఇప్పించే బాధ్యత ప్రభుత్వాలదే: సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

CPI MLC Satyam

Agri Gold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసి, వారి సొమ్మును తిరిగి ఇప్పించే బాధ్యత ప్రభుత్వాలదేనని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల సంఘం జాతీయ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని రాజ్బహదూర్ గౌర్ హాల్లో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. అధ్యక్షురాలు విశ్వవధ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నెల్లికంటి సత్యం, అగ్రిగోల్డ్ కంపెనీ బాధితుల జాతీయ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు హాజరయ్యారు.

డిపాజిట్లు సేకరించే సంస్థలపై నియంత్రణ ఉండాలి : నెల్లికంటి సత్యం

సత్యం మాట్లాడుతూ అగ్రిగోల్డ్లో పొదుపు చేస్తే కుటుంబ అవసరాలు, పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో ప్రజలు డబ్బులు పెట్టారని, సంస్థ మోసం చేయడంతో లక్షలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని సత్యం అన్నారు. ఇంత పెద్ద సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంపై ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఇప్పటివరకు సాగిన పోరాటాలతోపాటు జిల్లాల వారీగా బాధితులను సమీకరించి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. బాధితులు పెద్ద సంఖ్యలో రోడ్డుకిస్తే ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితుల ప్రతినిధులతో చర్చించాలని సత్యం కోరారు. తన వంతుగా బాధితుల ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రిని కలిసేందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : ముప్పాళ్ల నాగేశ్వరరావు

అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తెలంగాణలోని సుమారు మూడు లక్షల అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధితుల ప్రతినిధులతో నేరుగా చర్చించాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని క్రియాశీలం చేసి, సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఆందోళనలకు బదులుగా చర్చల ద్వారా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విశ్వవధ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల ప్యాకేజీ పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ వెంటనే ఉమ్మడి జిల్లాల స్థాయిలో కన్వీనర్లను, ఎజెంట్రాస్ అధిక సంఖ్యలో సమీకరించి జిల్లా సమావేశంలో ఏర్పాటు చేసేపాలనపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి జెవిఆర్, ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి శ్రీనివాస్, ఆనంద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.