Skip to content
తెలంగాణ వార్తలు

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం… నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Prajapaksham 25 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం… నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం... నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

Hyderabad Weather Update: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రేపటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు నగరంలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ఇదే సమయంలో ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు.

హైదరాబాద్ వాతావరణంపై వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. నెలాఖరు వరకు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు తలెత్తే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరోవైపు, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే, రాబోయే నాలుగు రోజుల వరకు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. జూలై 26 వరకు నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఆ తర్వాత అడపాదడపా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు, ప్రయాణికులు వాతావరణ శాఖ తాజా బులెటిన్లను ఎప్పటికప్పుడు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున స్థానిక యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది.