తెలంగాణలో 22-ఏ భూములపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు.. ప్రైవేటు భూములకు రిజిస్ట్రేషన్‌పై స్పష్టత
CM Revanth Reddy’s Key Message at Tungabhadra Brings New Hope for Farmers of Three States
రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారు.
తెలంగాణలో 22-ఏ భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు 22-ఏ భూముల అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాల వారీగా 22-ఏ జాబితాలో ఉన్న భూములపై సమగ్ర పరిశీలన చేపట్టాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా తుది జాబితాను రూపొందించాలని సూచించారు. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
ముఖ్యంగా 22-ఏ జాబితాలో ఉన్న భూమి.. ప్రైవేటు భూమి అని నిర్ధారణ అయితే, వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ఏళ్లుగా తమ భూములపై హక్కులు, రిజిస్ట్రేషన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించే అవకాశం ఉంది. స్లాట్ తీసుకున్న వారి భూములను రెండు రోజుల్లోగా పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. భూమి స్వభావం, రికార్డులు, హక్కులకు సంబంధించిన వివరాలను పరిశీలించి సమస్యను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
ప్రైవేటు భూముల్లో ఒక్క అంగుళానికి కూడా ఇబ్బంది రానివ్వబోమని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ హక్కుల విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 22-ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో భూ సమస్యల పరిష్కారం పేరుతో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం ప్రజలకు సూచించారు. అధికారిక సమాచారం లేకుండా వస్తున్న పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని హెచ్చరించారు.
భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దడంతో పాటు అర్హులైన ప్రైవేటు భూ యజమానులకు వారి హక్కులను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు. జిల్లాల వారీగా అధికారులు వేగంగా పనిచేసి, సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అనే సందేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సమీక్ష ద్వారా స్పష్టం చేశారు. 22-ఏ భూములపై ప్రభుత్వం చేపట్టనున్న తదుపరి చర్యలపై భూ యజమానుల్లో ఆసక్తి నెలకొంది.
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్
- Land Pooling Policy: తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ.. భూయజమానులకు నగదు బదులు డెవలప్డ్ ప్లాట్లు..?