FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి
FIDE Women’s Chess World Cup: ఉత్కంఠభరిత పోరులో దివ్య దేశ్‌ముఖ్ దే పై చేయి
జార్జియాలోని బటుమిలో సోమవారం జరిగిన FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) గెలుచుకుంది. టైటిల్ పోరులో తన స్వదేశీయురాలు, ప్రముఖ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ (Koneru Hampi) ని టైబ్రేకర్లలో ఓడించింది. తొలి గేమ్ డ్రా కాగా, రెండవ రాపిడ్ గేమ్‌లో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ అద్భుత విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ ప్రేమికులు
19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ మొదటి గేమ్‌ను డ్రాగా ముగించగా, రెండవ గేమ్‌లో కూల్‌గా, స్ట్రాటజిక్‌గా ఆడుతూ విజయం సాధించింది. దివ్య ఈ మ్యాచ్‌లో చూపిన మెచ్యూరిటీ, మౌలిక శక్తి, నైపుణ్యం ఆమెకు ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెస్ ప్రేమికులు ఈ విజయాన్ని ఎంతో ఆనందంగా స్వాగతించారు.
కోనేరు హంపీ కుటుంబం గురించిన సమాచారం ఉందా?
కోనేరు హంపీ తండ్రి కోనేరు అశోక్, ఒక చెస్ కోచ్. ఆయనే హంపీకి చిన్ననాటి నుండే శిక్షణ ఇచ్చారు. ఆమె వివాహం అనిరుద్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీరుతో జరిగింది. వాళ్లకు ఒక కుమార్తె ఉంది.
కోనేరు హంపీకి పురస్కారాలు ఏవైనా లభించాయా?
అవును, కోనేరు హంపీకి భారత ప్రభుత్వం తరపున,అర్జున అవార్డు (2003),పద్మశ్రీ (2007)
అంటివి లభించాయి.
Read Hindi News : hindi.vaartha.com
Read also : South Central Zonal Athletics: ప్రారంభమైన సౌత్ సెంట్రల్ జోనల్ అథ్లెటిక్స్