‘క్విట్ ఇండియా’ నినాద రూపకర్త: యూసఫ్ మెహర్ అలీ
Yusuf Meherally
ఎండి. ఉస్మాన్ ఖాన్
చరిత్రలో కొన్ని పదాలు కాలపరీక్షకు తట్టుకుని శాశ్వతంగా నిలిచిపోతాయి. కేవలం అక్షరాల సమాహారంగా మిగిలిపోవు; ఒక కాల ఆవేదనకు స్వరమవుతాయి, ఒక జాతి ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపే పిలుపుగా మారతాయి. ‘క్విట్ ఇండియా!’ కేవలం రెండు పదాలు. కానీ ఆ రెండు పదాలే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేశాయి. బానిసత్వపు సంకెళ్లను తెంచుకోవాలన్న భారతీయుల అచంచల సంకల్పానికి ప్రతీకగా నిలిచాయి. దేశమంతా ఆ నినాదం మారుమోగినప్పుడు ప్రతి గ్రామం ఉద్యమ కేంద్రంగా, ప్రతి వీధి స్వాతంత్య్ర పోరాట వేదికగా రూపాంతరం చెందిం ది. స్వేచ్ఛ ఇక వాయిదా వేయలేని లక్ష్యమని భారతీయ సమాజం స్పష్టంగా గ్రహించింది. చారిత్రక నినాదం వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ. అయితే ఆ పదాలను తొలిసారిగా మలిచిన వ్యక్తి యూసఫ్ మెహర్ అలీ. భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను ప్రభావి చేసిన అత్యంత శక్తివంతమైన నినాదాలకు రూపకర్త అయిన ఈ నాయకుడు, తన సేవలకు చరిత్రలో తగిన గుర్తింపును పొందకపోవడం విచారకరం. సెప్టెంబర్ 23న బొంబాయిలోని ఒక సంపన్న, విద్యావంతమైన కుటుంబంలో జన్మించిన యూసఫ్ మెహర్ అలీ న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. విజయవంతమైన న్యాయవాదిగా సౌకర్యవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నప్పటికీ, వ్యక్తిగత అభివృద్ధికంటే దేశ విముక్తినే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. న్యాయస్థానాల్లో వాదనలు వినిపించడం కంటే ప్రజల హక్కుల కోసం వీధుల్లో పోరాడడమే తన ధర్మమని భావించారు.ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న వలసవాద వ్యతిరేక ఉ ద్యమాలు, కార్మిక పోరాటాలు ఆయన ఆలోచనలను ప్రభావితం చేశాయి. ఆయన దృష్టిలో సామ్యవాదం అంటే కేవలం ఆర్థిక సిద్ధాంతం కాదు; ప్రతి మనిషి గౌరవంగా జీవించే సమాజాన్ని నిర్మించే విలువల వ్యవస్థ. అప్పుల బంధనాల నుంచి రైతు విముక్తి పొందాలని, కార్మికుడికి న్యాయమైన వేత నం లభించాలని, కులమతాల గోడలు సమాజాన్ని విభజించకూడదని ఆ యన విశ్వసించారు. ఈ ఆలోచనలే విద్యార్థులు, కార్మికులు, యువతను ఒకే ఉద్యమ వేదికపైకి తీసుకువచ్చే నాయకుడిగా ఆయనను నిలబెట్టాయి.
ప్రజలను సంఘటితం చేయాలంటే సరళమైన, పదునైన భాష అవసరమని మెహర్ అలీ తొలినాళ్లలోనే గ్రహించారు. గంటలకొద్దీ సాగే ప్రసంగాల కంటే, ఒక చిన్న నినాదమే లక్షలాది మందిని ఒక్క క్షణంలో ఏకం చేయగలదని ఆయన నమ్మారు.
1928లో భారతీయుల ప్రమేయం లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్‌ను నియమించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఆ సమయంలో బొంబాయి వీధుల్లో ఆయన వినిపించిన ’సైమన్ గో బ్యాక్’ నినాదం క్షణాల్లో దేశమంతా వ్యాపించింది. విద్యార్థుల నుంచి కార్మికుల వరకు, సభల నుంచి గోడ రాతల వరకు అదే నిరసనకు ప్రతీకగా మారిం ది. నాటికి రెండో ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ పాలకుల నిర్లక్ష్యం, స్వాతంత్య్ర ఆకాంక్ష దేశాన్ని కీలక మలుపు వద్దకు తీసుకొచ్చాయి. అ లాంటి సమయంలో మెహర్ అలీ మలిచిన ’క్విట్ ఇండియా’ నినాదం బ్రిటి ష్ పాలనకు నేరుగా విసిరిన సవాలుగా నిలిచింది. ఆ పదబంధంలోని స్పష్టతను, ఉద్యమశక్తిని మహాత్మా గాంధీ వెంటనే గుర్తించి స్వీకరించారు. 1942 ఆగస్టు 8న గాంధీజీ ఇచ్చిన ‘చావో రేవో’ (డూ ఆర్ పిలుపుతో కలసి ‘క్విట్ ఇండియా’ భారత స్వాతంత్య్ర పోరాటానికి తుది సమర ఘంటికగా మారింది.
ప్రజలను ఉద్యమబాట పట్టించగల అసాధారణ నాయకుడిగా భావించిన బ్రిటిష్ పాలకులు ఆయనను పలుమార్లు జైలుకు పంపారు. అయితే జైలు గోడలు ఆయన ఆలోచనలను నిర్బంధించలేకపోయాయి. స్వాతం అనంతరం నిర్మించాల్సిన ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై ఆయన అక్కడే లోతుగా ఆలోచించా ముంబయి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మెహర్ అలీ ఉద్య స్ఫూర్తినే పరిపాలనలోనూ ప్రతిబింబించారు. నగర అభివృద్ధి అంటే కే భవనాల నిర్మాణం కాదని, సాధారణ ప్రజల జీవన ప్రమాణాల మె రుగుదలేనని నమ్మారు. ప్రజా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీత నం, సామాజిక న్యాయానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యమాలు, జైలు జీవితం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. స్వాతంత్య్రం వచ్చిన కొద్ది కాలానికే, కేవలం 47 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశా రు. జీవితం చిన్నదైనా, ఆయన ఆలోచనలు, నినాదాలు భారత చరిత్రలో శాశ్వత ముద్ర వేశాయి. ’క్విట్ ఇండియా’, ‘సైమన్ గో బ్యాక్’ వంటి నినాదాలు ప్రతి భారతీయుడికి సుపరిచితమైనప్పటికీ, వాటి రూపకర్త యూసఫ్ మెహర్ అలీ పేరు మాత్రం అంతగా ప్రజల్లో ప్రాచుర్యం పొందలేదు. అధికారాన్ని ఆశించని, కీర్తి కోసం పరుగులు తీయని ఆయన తనకోసం స్మారకాలు నిర్మించుకోలేదు; ఒక జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పదాలను మాత్రం సృష్టించి వెళ్లారు. నేడు ’క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని స్మరించుకోవడం అంటే కేవలం ఒక చారిత్రక ఘ ట్టాన్ని గుర్తుచేసుకోవడం కాదు; స్వేచ్ఛను ఒక సమర నినాదంగా మలిచిన ఆ మేధావిని, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ అసమాన త్యాగధనుడిని గౌరవించుకోవడమే.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక