Skip to content
జాతీయం వార్తలు

పుస్తకాలతో హైవే నిర్మాణం!

Prajapaksham 27 Jul 2026 0 నిమిషాల పఠనం జాతీయం
పుస్తకాలతో హైవే నిర్మాణం!

Highway construction using books!

కొంత వాస్తవం… మరికొంత అతిశయోక్తి కలగలసిన సమాచారంగా ఎం6 మోటార్‌వే నిర్మాణాన్ని ప్రస్తావించుకోవాలి. ఇంగ్లాండ్‌లోని వెస్ట్‌ లాండ్స్‌లో ఉన్న ఈ రహదారిని 2003లో పునర్నిర్మించారు. ఆ సమయం లో మిల్స్‌ అండ్‌ బూన్‌ ప్రచురణ సంస్థ వద్ద అమ్ముడుకాకుండా మిలిగిపోయిన 25 లక్షల పుస్తకాలను వినియోగించారని అంటారు. ఇందులో నిజం లేకపోలేదు. పుస్తకాలను రీసైక్లింగ్‌ చేశారు. వాటి గుజ్జును ఇతర పదార్థాలతో కలిసి రోడ్డు అడుగు భాగంలో ఉపయోగించారు. ఇందులో ఎన్ని పుస్తకాలు వినియోగించారన్నది ఎవరూ లెక్కించలేదు. అయితే, సుమారుగా 25 లక్షల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా కొంత వ్యతిరేకత కూడా లేకపోలేదు. ఇది సాహిత్య పరంగా ఒక విరుద్ధ భావనను కలిగిస్తుంది. ఒకవైపు పుస్తకాలు జ్ఞానానికి చిహ్నం. మరోవైపు అవే పుస్తకాలు రో డ్డు నిర్మాణాన్ని వినియోగించడం వాటి పట్ల ప్రదర్శించే నిర్లక్ష్యానికి నిదర్శ నం. కానీ, ఇక్కడ భావోద్వేగం కంటే వాస్తవం ముఖ్యం. వినియోగించకుండా పక్కన పడేస్తే వృథా అయ్యేవి. రీసైక్లింగ్‌ ద్వారా అవి కనీసం ఉపయోగంలోకి వచ్చాయి. ఇలావుంటే, ఈ ఘటనను నవలల పట్ల పాఠకుల్లో ఆసక్తి ఉండదని, అందుకే, లక్షలాది పుస్తకాలు అమ్ముడుకాకుండా ఉండిపోయాయని విమర్శించేవారు కూడా లేకపోలేదు. అయితే, ఇది సరైన వాదన అనిపించుకోదు. మార్కెట్‌లో అమ్మకాలను బట్టి సాహిత్య విలువను అంచనా వేయలేం. ఇది కేవలం డిమాండ్‌ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే సూచిస్తుంది.