Skip to content
ప్రపంచం వార్తలు

Monsoon Weather Update: INSAT-3DS ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాలు ఇవే… దేశంలోని ఈ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మేఘావృతం…భారీ వర్షాలు పడే ఛాన్స్..

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Monsoon Weather Update: INSAT-3DS ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాలు ఇవే… దేశంలోని ఈ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మేఘావృతం…భారీ వర్షాలు పడే ఛాన్స్..

Monsoon Weather Update: INSAT-3DS ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాలు ఇవే... దేశంలోని ఈ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మేఘావృతం...భారీ వర్షాలు పడే ఛాన్స్..

ఇస్రోకు (ISRO) చెందిన అధునాతన వాతావరణ ఉపగ్రహం INSAT-3DS భారతదేశంపై కమ్ముకున్న విస్తారమైన రుతుపవనాల మేఘాల చిత్రాలను అంతరిక్షం నుంచి తీసింది. ఈ ఉపగ్రహ చిత్రంలో దేశంలోని ప్రధాన భాగాలన్ని మేఘావృతం అయి ఉన్నట్లు చూడవచ్చు. జులై 22న ఈ తాజా ఉపగ్రహ చిత్రాలను భారత వాతావరణ విభాగం (IMD) అధికారికంగా విడుదల చేసింది. ఇందులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నట్లు ఈ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది.

శాటిలైట్ నుంచి తీసిన ఈ చిత్రాల్లో ముఖ్యగా మధ్య, ఉత్తర, తూర్పు, దక్షిణ భారతదేశవ్యాప్తంగా దట్టమైన మేఘాలు విస్తరించి ఉన్నట్లు చూడవచ్చు. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని గంగా నది తీర ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ దట్టమైన మేఘాలు కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే పశ్చిమ రాజస్థాన్, గుజరాత్ వంటి పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మాత్రం మేఘాల్లేకుండా స్పష్టంగా ఉన్నాయి.

భారత భూభాగంపైనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్రం మీదుగా కూడా రుతుపవనాల మేఘాలు దట్టంగా చూడవచ్చు. INSAT-3DS ఉపగ్రహం ఉపయోగంచి దేశ వాతావరణ అంచనా వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇస్రో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ వాతావరణ ఉపగ్రహం ఉపయోగించి భారత ఉపఖండం మీదుగా ఉన్న వాతావరణ వ్యవస్థలు, మేఘాల కదలికలు, వాతావరణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించే పరికరాలు ఈ ఉపగ్రహంలో అందుబాటులో ఉన్నాయి.

ఐఎండీ (IMD) ఈ ఉపగ్రహ డేటాను ఉపయోగించి నైరుతి రుతుపవనాల కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. అంతేకాదు భారీ వర్షాలు, ఉరుములు, తుఫానులు వంటి వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి, రోజువారీ నివేదికలు సిద్ధం చేయడానికి ఈ సమాచారం ఎంతో కీలకం. థర్మల్ ఇన్‌ఫ్రారెడ్, విజిబుల్ ఇమేజెస్ ద్వారా మేఘాలు ఎంతమేర విస్తరించి ఉన్నాయి, అవి ఎటువైపు కదులుతున్నాయో వాతావరణ నిపుణులు అంచనా వేస్తారు. వాతావరణంలోని తేమ శాతాన్ని తెలుసుకోవడానికి వాటర్ వేపర్ ఇమేజరీ సహాయపడుతుంది, ఇది రుతుపవనాల పరిస్థితిని పర్యవేక్షించడానికి చాలా ముఖ్యమైనది. అలాగే ఈ ఉపగ్రహంలోని ఎన్‌హాన్స్‌డ్ ఇన్‌ఫ్రారెడ్ చిత్రాల ద్వారా అతి ఎత్తైన, చల్లని మేఘాలను గుర్తించి, ఏయే ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందో అధికారులు విశ్లేషిస్తారు.

ఆకాశంలో దట్టమైన మేఘాలు ఉన్నంత మాత్రాన అన్ని చోట్లా ఒకేసారి వర్షం పడాలని లేదు, స్థానిక వాతావరణ పరిస్థితులపై అది ఆధారపడి ఉంటుంది. అందుకే ఐఎండీ ఈ ఉపగ్రహాలతో పాటు డోప్లర్ రాడార్లను, మోడల్స్‌ను ఉపయోగించి 24 గంటలూ వాతావరణాన్ని పర్యవేక్షిస్తోంది.