భక్తిరస థ్రిల్లర్‌గా ‘వృషకర్మ’
Vrushakarma
యువ సామ్రాట్ నాగచైతన్య చిత్రం ‘వృషకర్మ’ విభిన్నమైన నేపథ్యంతో రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తుండగా, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నారు. జయరామ్, బేబీ కియారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి రాగుల్ డి. హెరియన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. నాగచైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, బేబీ కియారా తదితరులు నటిస్తున్నారు.