Skip to content
వినోదం › వార్తలు

‘తులాభారం’ షూటింగ్ షురూ

Prajapaksham 12 Oct 2026 0 నిమిషాల పఠనం వినోదం
‘తులాభారం’ షూటింగ్ షురూ

Thulabharam

రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ఆర్ టి 78 తెరపైకి వస్తోంది. క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ విజయంతో జోరు మీదున్న రవితేజ.. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. చిత్ర బృందం సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంతో సినిమా అధికారికంగా ప్రారంభమై, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లోకి అడుగుపెట్టనుంది. ముహూర్తం సందర్భంగా వీవీ వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. చందు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, శ్రీ విష్ణు క్లాప్ కొట్టారు. శివ నిర్వాణ, బాబీ కలిసి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌తో పాటు పలువురు అతిథులు పాల్గొన్నారు.
ఈ సినిమా టైటిల్‌ను రివిల్ ను మేకర్స్ వినూత్నంగా రూపొందించిన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోను విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ తనదైన స్టయిల్ లో రూపొందించిన ఈ వీడియోను మై హో రామ్ విడుదల చేశారు. ‘తులాభారం’ టైటిల్‌ను ఎంపిక చేసే ప్రక్రియ వెనుక జరిగిన సరదా, వినోదభరితమై సంభాషణలను ఈ వీడియో ద్వారా చూపించారు. విలక్షణమైన క్రియేటివ్ వరల్డ్ ను పరిచయం చేస్తూ ఈ టైటిల్ డాక్యుమెంటరీ ఆకట్టుకుంటోంది.ఈ వీడియోలో సినిమాలోని కీలక పాత్రలను కూడా పరిచయం చేశారు. జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి ఆంటోనీ, సౌండ్‌గా అనస్వర రాజన్, దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్ కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.