‘రణబాలి‘ పరిశ్రమ గర్వపడే సినిమా అవుతుంది
Ranabaali
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి‘. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై ‘రణబాలి’ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ‘రణబాలి‘ సినిమా వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ రణబాలి సెట్లో టీమ్ అంతా నెలలు నెలలు హార్డ్ వర్క్ చేసేవారు. నేను నా క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేసేందుకు నాలుగైదు రోజులు షెడ్యూల్ కోసం వెళ్లాను. అలాంటి టైమ్ లో వాళ్లు చేసే హార్డ్ వర్క్ చూస్తే భయమేసేది. జయమ్మ అనే పాత్ర మీ మనసుల్లో ఉండిపోతుంది. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సరిగ్గా 150 ఏళ్ల క్రితం సూపర్ ఎల్ నినో వచ్చింది. అదే గ్రేట్ మద్రాస్ ఫామైన్. ఆ టైమ్లో బ్రిటీషర్స్ చేసిన ఘోరాల వల్ల ఆ మహా కరువు 80 లక్షల మంది చావుకు కారణమైంది. ఒక సైకిల్లా ఆ ఎల్ నినో రిపీట్ అవుతున్నా, మనం మన పూర్వీకులు చూసిన బాధలు చూడకూడదు. అందుకే మనం నీళ్లు, కరెంట్, ఫుడ్ ను జాగ్రత్తగా వృథా చేయకుండా చూసుకోవాలి. సీఎం గారు చెప్పారంటే అది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్లే దమ్ము మన ఇండియన్స్ లో ఉంది.