Skip to content
వినోదం › వార్తలు

‘రామాయణం’ కొత్త చరిత్ర సృష్టించాలి: నిర్మాత దిల్‌ రాజు

Prajapaksham 22 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘రామాయణం’ కొత్త చరిత్ర సృష్టించాలి: నిర్మాత దిల్‌ రాజు

Ramayana

రణ్‌బీర్‌ కపూర్‌, రాకింగ్‌ స్టార్‌ యశ్‌, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణం’ వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నితేష్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్‌ మల్హోత్రాకు చెందిన ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, డిఎన్‌ ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషనల్‌ కంటెంట్‌ ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. రెండు భాగాల సినిమాటిక్‌ ఇతిహాసంగా ‘రామాయణం’ రూపొందుతోంది. తొలి భాగం 2026 నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఎస్‌విసి ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ హైదరాబాద్‌లో గ్రాండ్‌ తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. హాలీవుడ్‌లో సోనీ సంస్థ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తోంది. నార్త్‌లో కరణ్‌ జోహార్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నమిత్‌ ని కలిసినప్పుడు 3డీ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్‌ చూపించారు. మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించాయి. మీరు థియేటర్‌లో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ చేయబోతున్నారు. నితీష్‌ ‘దంగల్‌’ సినిమాతో ఇండియన్‌ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఇందులో సీత పాత్రలో నటించిన సాయి పల్లవి మన తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఆమె ‘రామాయణం’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతోంది. అలాగే ఇందులో శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్‌ కూడా మన దగ్గర ఎన్నో సినిమాలు చేశారు. యశ్‌ గారు ఇండియన్‌ సినిమాలోనే ఒక చరిత్ర సృష్టించారు. రేపటి నుంచి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అవుతున్నాయి. . ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లో నటుడు యశ్‌ , రణ్‌బీర్‌ కపూర్‌ , హీరోయిన్‌ సాయి పల్లవి , రవి దూబే , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, డైరెక్టర్‌ నితేష్‌ తివారీ, నిర్మాత నమిత్‌ మల్హోత్రా, కరణ్‌ జోహార్‌ పాల్గొన్నారు.