‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ రిలీజ్ చేసిన నాగార్జున
Rambha Urvasi Menaka
అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పౌరాణిక కథలు, గ్రామీణ హాస్యం, వినోదాత్మకమైన అంశాలతో అలరించనుంది. కింగ్ నాగార్జున ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. సూరి(అల్లరి నరేష్) మొక్కుబడులతో భూలోకానికి దిగివచ్చిన రంభ, ఊర్వశి, మేనకలు.. తమ దివ్య శక్తులను కోల్పోవడంతో అసలు కథ మొదలవుతుంది. ముగ్గురు అప్సరసలు తన ఇంట్లో ఉండటంతో సూరికి ఎదురయ్యే ఇబ్బందులు, అతడి ప్రేయసి గొడవ, పోలీసుల విచారణ, మరోవైపు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న తల్లి.. ఇలా వరుస సమస్యలతో కథలో ఎంటర్టైమెంట్ ని ట్రైలర్ అద్భుతంగా ప్రజెంట్ చేసింది.ట్రైలర్‌ను దర్శకుడు చంద్ర మోహన్ చింతాడ ఆద్యంతం ఎంటర్టైనింగ్గా నడిపించారు. ముఖ్యంగా అల్లరి నరేష్, నరేష్ వీకే మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి ‘ఓజీ’లోని జపనీస్ డైలాగ్‌ను సరదాగా వాడిన విధానం ట్రైలర్‌కు మంచి కామెడీ ఎండింగ్ ఇచ్చింది.ట్రైలర్లో అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. అమాయకత్వం, ఎనర్జీ, కామెడీ కలగలిపిన ఆయన పాత్ర సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సురభి కథానాయికగా నటించగా, వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్రలో నవ్వులు పూయించారు. నరేష్ వీకే కూడా అల్లరి నరేష్‌తో కలిసి వచ్చే సన్నివేశాల్లో మెప్పించారు. రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ముగ్గురు అప్సరసలుగా అలరించారు.రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చిత్రానికి కలర్‌ఫుల్ లుక్ తీసుకొచ్చింది. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ ఫాంటసీ ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దగా, చైతన్ భరద్వాజ్ సంగీతం ట్రైలర్‌లోని ఎంటర్టైన్మెంట్ మూడ్‌కు ఎలివేట్ చేసింది.ట్రైలర్ చూస్తుంటే ‘రంభ ఊర్వశి మేనక’ పల్లెటూరి హ్యూమర్, పురాణ నేపథ్యం, ఫాంటసీ అంశాలను కలిపిన ఒక డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించింది.
- Vinayaka Chavithi 2026 Wishes In Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందమైన కొటేషన్స్ తో కూడి ఇమేజ్ గ్రీటింగ్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి..
- Ganesh Chaturthi 2026 Wishes in Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధు మిత్రులకు శ్లోకాలతో కూడిన ఈ కొటేషన్స్ వాట్సప్ ద్వారా షేర్ చేసుకోండి..
- Vinayaka Chavithi Wishes 2026: మీ బంధుమిత్రులకు వినాయక చవితి సందర్భంగా Whatsapp, SMS, X, Meta ద్వారా షేర్ చేయడానికి చక్కటి భక్తి భావంతో కూడిన Text Messeges మీ కోసం…
- Vinayaka Chavithi Wishes 2026: వినాయక చవితి శుభాకాంక్షలు .. మీకు మీ కుటుంబ సభ్యులకు 25 ప్రత్యేక శుభాకాంక్షలు
- తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు…మల్లు స్వరాజ్యం