డబ్బుల కోసం నటించాలనుకోను.. ‘క్రేజీ కల్యాణం‘ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran
నరేష్ విజయ కృష్ణ, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న ‘క్రేజీ కల్యాణం‘ రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. క్రేజీ కల్యాణం సినిమాకు ముందు వేరే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. ఈ సినిమాలో నాకు పెళ్లి అవుతుందా కాదా అనేది తెరపై చూడాలి. ఈ సినిమాలోలా మా ఇంట్లో నా పెళ్లి గురించి ఏమాత్రం ఒత్తిడి లేదు. నీకు ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే మా వాళ్లు అంటారు. నాకైతే పెళ్లికి ముందే ఒక బేబిని కనాలని ఉంది. మా కేరళ వివాహా వేడుకల్లో పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. కానీ తెలంగాణ పెళ్లి వేడుకల్లో కొత్త కల్చర్ తెలుసుకున్నాను. మా కేరళలో ఇప్పుడు పెళ్లి వేడుకల్లో హల్దీ, మెహందీ అని కొత్త కొత్త కల్చర్స్ వస్తున్నాయి గానీ గతంలో ఎంగేజ్ మెంట్ , పెళ్లి ఈ రెండే వేడుకలు జరిపేవారు. క్రేజీ కల్యాణం సినిమాలో మా క్యారెక్టర్స్ అన్ని స్ట్రగుల్ పడుతుంటాయి. మా కష్టాలు మీకు కామెడీగా అనిపిస్తాయి. మా పాత్రల ద్వారా, ఆ సందర్భాల ద్వారా ఆర్గానిక్ గా కామెడీ జెనరేట్ అవుతుంటుంది. స్క్రిప్ట్ చెప్పేందుకు వచ్చినప్పుడే డైరెక్టర్ గా బద్రప్పలోని సిన్సియారిటీ, కన్విక్షన్ చూశాను. ఆయన ఈ కథ చెబుతుంటే కొన్ని సార్లు నవ్వొచ్చింది, కొన్ని సీన్స్కు ఎమోషనల్ అయ్యాను. బాలరాజు పాత్రతో సహా ఆయన కంప్లీట్ స్క్రిప్ట్ చెప్పారు. కథలో మా పాత్రలు పరిచయం అయ్యాక పెళ్లికి సంబంధించిన పాయింట్ వస్తుంది. ప్రేక్షకులు కథలోకి వెళ్లేందుకు పెద్దగా సమయం పట్టదు. పెళ్లి అనేది ఇద్దరు కలిసి సంతోషంగా జీవించడానికి చేసుకునేది కానీ అమ్మాయిని ఇంట్లో పని మనిషిని చేసేందుకు కాదు అనేది నా క్యారెక్టర్ కీర్తి ఉద్దేశం. వ్యక్తిగతంగా నా ఒపీనియన్ కూడా అదే. కొన్ని ప్రాజెకట్స్లో మనం చెప్పేందుకు ఏమీ ఉండదు. వాళ్లు ఇచ్చిన క్యారెక్టర్ చేసుకుని వెళ్లిపోతాం. కానీ క్రేజీ కల్యాణం లాంటి సినిమాలకు నా అభిప్రాయాలు చెప్పి, మాట్లాడుకుని చేసే స్పేస్ ఉంది. ఇలా మేమంతా కలిసి డిస్కస్ చేసుకుని నటించాం. సీన్స్ మరింత బెటర్ గా వచ్చేందుకే ఈ ప్రయత్నమంతా చేశాం. ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాను. యాస కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదుగానీ డైరెక్టర్ చెప్పేదాన్ని అబ్సర్వ్ చేస్తూ డైలాగ్స్ చెప్పాను. నటిగా నేనెప్పుడూ వెర్సటైల్గా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. క్రేజీ కల్యాణంలో కీర్తి పాత్ర కూడా అలా ప్రత్యేకంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. డబ్బుల కోసం నటించాలనుకోను. ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను నడిపించాలి. ప్రస్తుతం తమిళంలో, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాను.