Are You Still a Virgin? మీరు ఇంకా వర్జినేనా.. సల్మాన్ ఖాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్.. సల్లూ భాయ్ రియాక్షన్ వీడియోలో చూడండి
Salman Khan and Karan Johar
‘కాఫీ విత్ కరణ్’ చివరి సీజన్ ప్రోమో వైరల్.. అక్టోబర్ 14 నుంచి కొత్త ఎపిసోడ్
Are You Still a Virgin? బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ మరోసారి తమ సరదా సంభాషణతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ ప్రముఖులతో ఆసక్తికరమైన చర్చలకు వేదికగా నిలిచిన ‘కాఫీ విత్ కరణ్’ షో తొమ్మిదో సీజన్‌తో ముగియనుంది. ఈ చివరి సీజన్‌కు తొలి అతిథిగా సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కరణ్ అడిగిన ఓ వ్యక్తిగత ప్రశ్నకు సల్మాన్ తనదైన శైలిలో స్పందించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సల్మాన్ ఖాన్‌ను షోకు ఆహ్వానిస్తూ కరణ్ జోహార్.. గతంలో ఆయన చెప్పిన ‘ఇట్స్ డన్ బ్రో’ వ్యాఖ్యను ప్రస్తావించారు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ‘‘మీరు ఇప్పటికీ వర్జినేనా అని అడిగారు. దీనికి సల్మాన్ ‘‘కంట్రోల్ యార్ బ్రదర్’’ అంటూ చమత్కారంగా సమాధానమిచ్చారు. ఈ ప్రశ్న 2013లోనూ చర్చకు దారితీసింది. ఇప్పుడు చివరి సీజన్ ప్రోమోలో అదే ప్రశ్నను మళ్లీ అడగడంతో అభిమానులకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.
సంభాషణలో భాగంగా సల్మాన్ ఖాన్‌లో గతంతో పోలిస్తే ప్రశాంతత కనిపిస్తోందని కరణ్ వ్యాఖ్యానించారు. అందుకు సల్మాన్, ఇప్పటివరకు ఇతరులకు ఇచ్చిన సలహాలను తానే పాటించాల్సిన సమయం వచ్చిందని చమత్కారంగా స్పందించారు. ఆయన మాటలు ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి కెమెరాల ద్వారా చొరబడే ధోరణి వంటి అంశాలపైనా వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు ప్రోమోలో కనిపిస్తోంది. ఫోన్‌లో కెమెరాను కనిపెట్టిన వ్యక్తి ఎదురైతే వదిలిపెట్టనంటూ సల్మాన్ సరదాగా వ్యాఖ్యానించారు. సెలబ్రిటీల గోప్యత, ఛాయాచిత్రాల సంస్కృతిపై ఆయన అభిప్రాయాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
2004లో ప్రారంభమైన ‘కాఫీ విత్ కరణ్’ బాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు, కెరీర్, సంబంధాలపై సాగించే బహిరంగ సంభాషణలకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు తొమ్మిదో సీజన్‌తో ఈ షోకు ముగింపు పలకనున్నట్లు కరణ్ జోహార్ ప్రకటించారు. సీజన్ తొలి ఎపిసోడ్ అక్టోబర్ 14న జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. సల్మాన్ ఖాన్‌తో పూర్తి ఎపిసోడ్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయా అన్నది అభిమానులు ఎదురుచూస్తున్నారు.