‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్
Bharatavarsha
టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో నవరాత్రుల సందర్భంగా ‘భరతవర్ష’ నుంచి రెండో పాటను విడుదల చేశారు.‘అమ్మ కదిలి వచ్చె’ పేరుతో విడుదలైన ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని, నవరాత్రి ఉత్సవాల చుట్టూ ఉండే ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. పాట పేరుకు తగ్గట్టుగానే, ఆ ప్రాంత ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆరాధించే శూలాంభ అమ్మవారి ఉత్సవ ఊరేగింపును ఇందులో చూపించారు. భక్తులు అమ్మవారిని పండుగ వాతావరణంలో ఊరేగింపుగా తీసుకురావడం, విగ్రహ ప్రతిష్ఠాపన కోసం నిర్వహించే పూజా కార్యక్రమాలను దృశ్యరూపంలో అద్భుతంగా తెరకెక్కించారు. కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని తన శక్తివంతమైన దాలతో అమ్మవారి దివ్య వైభవాన్ని, ఉగ్రశక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. సింగర్ స్కంద వేలువలి బృందంలోని ఇతర గాయకులతో కలిసి తన వాయిస్ గానంతో భక్తిభావాన్ని మరింత పెంచారు. ఈ పాట ప్రేక్షకులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.ఉత్సవాల నేపథ్యంలో గోపీచంద్, రీతూ వర్మ అద్భుతంగా కనిపించారు. సంప్రదాయ ఆచారాలు, పాటను విజువల్ గా ఆకట్టుకునేలా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతిని అందించేలా రూపొందించారు. గోపీచంద్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.