Skip to content
బిజినెస్ వార్తలు

YouTube: యూట్యూబ్‌లో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కష్టమే.. వాచ్ అవర్స్ టార్గెట్ రెట్టింపు

Prajapaksham 11 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
YouTube: యూట్యూబ్‌లో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కష్టమే.. వాచ్ అవర్స్ టార్గెట్ రెట్టింపు

Youtube

YouTube: యూట్యూబ్ (YouTube) ద్వారా డబ్బు సంపాదించాలని భావించే కొత్త కంటెంట్ క్రియేటర్లకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో భాగంగా మానిటైజేషన్‌కు అవసరమైన అర్హత ప్రమాణాలను యూట్యూబ్ భారీగా పెంచింది. ఇంతకుముందు ఛానెల్ మానిటైజ్ కావాలంటే గత 365 రోజుల్లో 4,000 వాచ్ అవర్స్ లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉంటే సరిపోయేది.

అయితే తాజా మార్పుల ప్రకారం..లాంగ్ వీడియోల విషయానికి వస్తే.. గత 365 రోజుల్లో క్వాలిఫైడ్ వాచ్‌టైమ్ 8 వేల గంటలకు పెరిగింది. షార్ట్స్ వ్యూస్ అయితే గత 90 రోజుల్లో షార్ట్స్ వీక్షణల పరిమితి 20 మిలియన్లకు చేరింది. సబ్‌స్క్రైబర్లు విషయానికి వస్తే.. 1,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలనే నిబంధనలో ఎలాంటి మార్పు లేదు.

ఇప్పటికే వైపిపి (YPP)లో ఉన్న 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది క్రియేటర్లపై ఈ కొత్త నిబంధనల ప్రభావం ఉండదు. ఈ నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. షార్ట్స్ ద్వారా వచ్చే ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్ ఆదాయాన్ని పంచుకోవడానికి 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ సాధించాలనే నిబంధన కొత్తవారితో పాటు పాత క్రియేటర్లకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు నిరంతరాయంగా వీడియోలు చూసేందుకు ‘యూట్యూబ్ ప్రీమియం లైట్’ (YouTube Premium Lite) సేవలను భారత్‌తో సహా ఇతర దేశాలకు విస్తరించారు. స్టాండర్డ్ ప్లాన్ ధర నెలకు రూ.149 కాగా, ఈ ప్రీమియం లైట్ ప్లాన్ ధరను నెలకు రూ. 89గా నిర్ణయించారు. దీనివల్ల క్రియేటర్లకు ప్రకటనల రహిత వీక్షణల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

  1. YPP ప్రవేశ పరిమితుల పెంపు (కొత్త క్రియేటర్లకు మాత్రమే)

దీర్ఘ-రూప (Long-form) వీడియోలు: గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ ఉండాలి (ఇంతకుముందు ఇది 4,000 గంటలుగా ఉండేది).
షార్ట్స్ (Shorts): గత 90 రోజుల్లో 20 మిలియన్ల క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ సాధించాలి.
పాత క్రియేటర్లపై ప్రభావం లేదు: ఇప్పటికే YPPలో ఉన్న క్రియేటర్లకు ఈ నిబంధన వర్తించదు.
ఫ్యాన్ ఫండింగ్ పరిమితులు మారలేదు: Super Chats, Memberships మరియు YouTube Shopping ఉత్పత్తుల కోసం పాత ప్రవేశ పరిమితులే కొనసాగుతాయి.

  1. యూట్యూబ్ షార్ట్స్ ఆదాయంలో మార్పులు

ఫిబ్రవరి 1, 2027 నుండి: షార్ట్స్‌పై ప్రకటనలు మరియు సబ్‌స్క్రిప్షన్ ఆదాయంలో వాటా పొందాలంటే క్రియేటర్లు గత 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వీక్షణలు కొనసాగించాల్సి ఉంటుంది.
10 మిలియన్ల కంటే తక్కువ వీక్షణలు ఉన్న క్రియేటర్లు YPPలోనే ఉంటారు, దీర్ఘ-రూప కంటెంట్‌పై సంపాదిస్తారు. వీక్షణలు మళ్లీ 10 మిలియన్లు దాటిన వెంటనే షార్ట్స్ ఆదాయ వాటా స్వయంచాలకంగా ప్రారంభమవుతుంది. తక్కువ వీక్షణలు ఉన్నవారికి ప్రత్యామ్నాయంగా యూట్యూబ్ షాపింగ్ బోనస్‌లు, బ్రాండ్ డీల్స్ మరియు ట్రెండ్ ప్రోత్సాహకాల వంటి కొత్త సంపాదన మార్గాలను యూట్యూబ్ ప్రవేశపెడుతోంది.

  1. ప్రీమియం లైట్ విస్తరణ & ఆదాయ వాటా

ప్రీమియం లభించే అన్ని దేశాలకు ప్రీమియం లైట్ సేవా విస్తరణ జరుగుతోంది.
క్రియేటర్ల ఆదాయ నిధి పంపిణీ
యూట్యూబ్ ప్రీమియం: నికర సబ్‌స్క్రిప్షన్ ఆదాయంలో 30% నిధిగా కేటాయిస్తారు.
ప్రీమియం లైట్: నికర సబ్‌స్క్రిప్షన్ ఆదాయంలో 60% నిధిగా కేటాయిస్తారు.
ఈ నిధి నుండి దీర్ఘ-రూప వీడియోల క్రియేటర్లు 55%, షార్ట్స్ క్రియేటర్లు 45% ఆదాయ వాటాను పొందుతారు.

ఈ కొత్త నిబంధనలు, ఒప్పందాలు ఫిబ్రవరి 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. క్రియేటర్లు వీటికి సంబంధించిన నిబంధనలను యూట్యూబ్ స్టూడియోలో సమీక్షించి అంగీకరించవచ్చు.