Skip to content
బిజినెస్ వార్తలు

PM Kisan Rejected: పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడలేదా..? అయితే ఏం చేయాలి ?

Prajapaksham 06 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
PM Kisan Rejected: పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడలేదా..? అయితే ఏం చేయాలి ?

PM Kisan Rejected: పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడలేదా..? అయితే ఏం చేయాలి ? ( Image Source: WIKI Pedia)

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ యోజన స్కీం కింద ఇప్పటివరకు 23 విడతలుగా 2000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. తాజాగా 23వ విడత డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల గువహాటిలో జరిగిన ఒక కార్యక్రమంలో నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం దాదాపు పది కోట్లకు పైగా ఉన్నటువంటి లబ్ధిదారుల అకౌంట్లలో 2000 రూపాయలు జమ అయ్యాయి. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది రైతుల ఎకౌంట్లో డబ్బులు ఇంకా పడలేదు. ముఖ్యంగా పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన పూర్తిస్థాయిలో ఈ కేవైసీ పూర్తి కావకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు పేర్కొంటున్నారు. పిఎం కిసాన్ యోజన నిధులు ఇంకా మీ అకౌంట్లో పడకపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు కొన్ని పొరపాట్లు చేయడం వల్లనే ఈ తరహా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం, ఆధార్ అలాగే బ్యాంకు ఖాతా అనుసంధానం లేకపోవడం, లేదా భూ రికార్డుల ధ్రువీకరణ పెండింగ్లో ఉండటం వంటి సందర్భంలో మాత్రమే పీఎం కిసాన్ యోజన డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.

పీఎం కిసాన్ యోజన డబ్బులు అసలు ఎందుకు ఆగిపోయాయో ముందుగా తెలుసుకోవాలి. . ముందుగా అధికారిక pmkisan.gov.in పోర్టల్ ద్వారా సమాచారం పొందవచ్చు. ఈ పోర్టల్ లో మీకు ఫార్మర్స్ కార్నర్ లో ఉన్న నో యువర్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అనంతరం e-KYC, Aadhaar-Bank Seeding, Land Seeding స్టేటస్ ఎస్ అని టిక్ చేసి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ నో అన్ని టిక్ చేసి ఉన్నట్లయితే మీ డబ్బులు పడకపోవడానికి అదే కారణం అని చెప్పవచ్చు.

ఒకవేళ ఈ కేవైసీ కనుక పెండింగ్లో ఉన్నట్లయితే మీరు వెంటనే మీ సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ భూమి రికార్డులు అప్డేట్ కాకపోయినా కూడా డబ్బులు పడవు అలాంటి సమయంలో మీ సమీపంలో ఉన్నటువంటి మండల వ్యవసాయ శాఖ అధికారిని కలిసి మీ భూ రికార్డులను పరిశీలించమని వినతి పత్రం సమర్పించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు కనుక లింకు కాకపోయినట్లయితే డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది అప్పుడు మీ సమీపంలో ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆధార్ నెంబర్ను మ్యాపింగ్ చేయమని కోరాలి. . పైన పేర్కొన్న సందర్భంలో మాత్రమే మీ డబ్బు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అదనపు సమాచారం కోసం మీరు 1800-11-5526, 1800-180-1551 నంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయండి.

ట్యాగ్‌లు: PM Kisan Yojana