27న ‘డేంజర్ బాయ్స్’విడుదల
Danger boys
యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ బాయ్స్’ (చాప్టర్ క్లోజ్). వికాస్, రాధాభగవతి, అశ్వని హాసన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు అభిజిత్ తీర్థహళ్లి రచన, దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో సినిమా అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 27వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో అత్యంత ఘనంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదలైన పోస్టర్లో ప్రధాన పాత్రధారులు రాత్రివేళ దట్టమైన అటవీ ప్రాంతంలో చేతిలో కాగడాలు, లాంతరు పట్టుకుని ఓ మిస్టరీని ఛేదించేందుకు వెతుకుతున్నట్లుగా కనిపించి.. సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఉత్కంఠభరితమైన ఈ లుక్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కళ్లకు కడుతోంది.ఈ సందర్భంగా నిర్మాతలో ఒకరైన పూర్ణిమ గౌడ్ మాట్లాడుతూ “కుటుంబ భావోద్వేగాలతో నిండిన ఒక విలక్షణమైన యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు అభిజిత్ తీర్థహళ్లి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని పంచుతుంది. ఇంతటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ: సునాద్ గౌతమ్, రచన – దర్శకత్వం: అభిజిత్ తీర్థహళ్లి, నిర్మాతలు: వి.జి. మంజునాథ్ – పూర్ణిమ గౌడ్.