Skip to content
వినోదం › వార్తలు

‘ఫౌజీ’ పోస్టర్ విడుదల

Prajapaksham 24 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘ఫౌజీ’ పోస్టర్ విడుదల

'Fauzi' poster released

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకలు అందుతున్నాయి. తమ అభిమాన హీరో పుట్టినరోజును ఫ్యాన్స్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పండుగలా జరుపుకుంటున్నారు. ఒకవైపు ప్రభాస్ నటించిన పాత సినిమాల రీ-రిలీజ్‌ల‌ సందడి చేస్తుండగా, మరోవైపు కొత్త చిత్రాల నుంచి వచ్చే అప్‌డేట్స్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ చిత్ర బృందం అభిమానులకు ప్రత్యేక కానుకను ప్రకటించింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రే అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన ‘ఫౌజీ’ చిత్ర బృందం.. సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
‘ఎవరతను?’ అనే ప్రశ్నతో ఈ అప్‌డేట్‌పై మరింత ఆసక్తిని పెంచింది. ఈ వీడియోలో ప్రభాస్ పాత్రను ఎలా పరిచయం చేయబోతున్నారు? ఆయన లుక్ ఎలా ఉండబోతోంది? సినిమాలోని కథాంశానికి సంబంధించి ఏమైనా కొత్త విషయాలు వెల్లడవుతాయా? అన్న ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. ప్రభాస్ సినిమాల నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం ఎదురుచూసే అభిమానులకు ‘ఫౌజీ’ టీమ్ ప్రకటన మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.