అక్టోబర్ 30న థియేటర్లలోకి ‘ఆదర్శ కుటుంబం
Adarsha Kutumbam
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదం, హాస్యం, యాక్షన్‌తో అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం సిద్ధమవుతోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ.ఎస్. ప్రకాశ్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కెవిన్ కుమార్ ఫైట్స్‌ను రూపొందించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్, ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్, ఎడిటింగ్: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఎ.ఎస్. ప్రకాశ్, ఫైట్స్: కెవిన్ కుమార్, నిర్మాత: ఎస్. రాధాకృష్ణ .