Skip to content
వినోదం › వార్తలు

‘కరికాల’లో గాయత్రి భరద్వాజ్‌

Prajapaksham 15 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘కరికాల’లో గాయత్రి భరద్వాజ్‌

Gayatri Bhardwaj

సందీప్‌ కిషన్‌ హీరోగా షైనింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్‌ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ‘శంబాల’ తర్వాత దర్శక, నిర్మాతలు మళ్లీ ఓ విజువల్‌ వండర్‌ను క్రియేట్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ‘కరికాల’ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ‘కరికాల’ మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్‌ 2027 అక్టోబర్‌ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్‌ చేసిన పోసర్‌లో సినిమాపై బజ్‌ను క్రియేట్‌ చేశాయి. రీసెంటుగా ఈ చిత్రం నుంచి కేథరిన్‌ థ్రెసా, సాక్షి మడోల్కర్‌ నటించనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్‌ కూడా ముఖ్య పాత్రను పోషించబోతోన్నారని మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు వెల్కమ్‌ ఆన్‌ బోర్డ్‌ అంటూ ‘కరికాల’ టీం స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.వరల్‌ క్లాస్‌ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌, అద్భుతమైన ప్రొడక్షన్‌ డిజైన్‌, అత్యద్భుతమైన కథనంతో ‘కరికాల’ పాన్‌ ఇండియన్‌ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోంది. ఈ సినిమాకి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 15న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరగబోతోన్నాయి. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులంతా పాల్గొని సందడి చేయనున్నారు.