Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్..
Today Weather
Telangana Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు దంచికొడుతున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో, విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని 15 జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, విజయవాడ నగరాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు , యానాం ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, అక్కడక్కడా ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేశారు.
ఇదే సమయంలో తెలంగాణలోనూ వర్షాలు కుండపోతగా మారుతున్నాయి. శనివారం ఉదయం నుంచే హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. రానున్న రెండు గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు నల్గొండ, సూర్యాపేట వైపు విస్తరిస్తున్నాయని అధికారులు వివరించారు. నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం , రాజధాని హైదరాబాద్ నగరంలోనూ అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని యంత్రాంగం హెచ్చరించింది.
- Harish Rao Farm House: అజీజ్‌నగర్ భూములపై కాంగ్రెస్ ఫీల్డ్ విజిట్.. కేటీఆర్, హరీశ్‌రావుపై చామల ప్రశ్నల వర్షం
- Harish Rao Farmhouse: అసైన్డ్ భూముల్లో ఫాం హౌస్ నిర్మించారు..అద్దంకి ఫైర్..హరీష్ రావు ఫాం హౌస్ భూముల్లో కాంగ్రెస్ నేతల ఫీల్డ్ విజిట్..
- Telangana Land Resurvey: భూముల రీ-సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. భూముల సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
- TIMS Hospital Theft: సనత్ నగర్ TIMS ఆసుపత్రిలో భారీ చోరీ.. 288 వైద్య పరికరాలు మాయం, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు
- Singareni Workers Land Issue: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం, 45 రోజుల్లో పరిష్కారం