Telangana PRC Update: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PRCపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు..
టీ క్యూర్ బిల్లు–2026కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
Telangana PRC Update: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదేశించారు. ఈ మేరకు రెండో పీఆర్సీ ఛైర్మన్ ఎన్. శివశంకర్‌కు సీఎస్ అధికారికంగా లేఖ రాశారు.
గతంలో నియమించిన రెండో వేతన సవరణ కమిషన్ గడువు ముగుస్తుండటం, మరోవైపు పీఆర్సీ అమలుపై ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి తీవ్రతరం కావడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది. బకాయి ఉన్న కరువు భత్యం (డీఏ)లను తక్షణమే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని సరైన ఫిట్మెంట్ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో సర్కార్ అప్రమత్తమైంది.
కమిషన్ నుంచి నివేదిక అందిన వెంటనే ఫిట్మెంట్ పరిమాణం మరియు కొత్త వేతన సవరణకు సంబంధించిన నిబంధనలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. సీఎస్ లేఖతో పీఆర్సీ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కడంతో, త్వరలోనే తమ వేతనాలు పెరుగుతాయనే ఆశలు ఉద్యోగుల్లో చిగురిస్తున్నాయి.
- Bank Holidays: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఈ తేదీల్లో బ్యాంక్ పనులు ఉంటే జాగ్రత్త..
- Telangana PRC Update: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PRCపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు..
- Telangana Politics: గవర్నర్‌ను కలిసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదుల వెల్లువ.. 1000 రోజులు గడిచినా హామీలు నెరవేర్చలేదని విమర్శ
- Telangana Political Row: కేసీఆర్‌కు చెడు జరగాలని కాంగ్రెస్ ఎప్పటికీ కోరుకోదు.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
- ‘AI Could Kill All Humans’: AI మనుషులందరినీ చంపొచ్చు.. ఈ దశాబ్దంలోనే మానవాళికి ముప్పు.. Anthropic పరిశోధకుడి సంచలన వ్యాఖ్యలు