Skip to content
వినోదం వార్తలు

బాలయ్య కొత్త సినిమా టైటిల్ ‘దాదా’

Prajapaksham 08 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
బాలయ్య కొత్త సినిమా టైటిల్ ‘దాదా’

balayya

నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాలయ్య “ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా” అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలకృష్ణ పోషిస్తున్న పాత్ర స్వభావాన్ని ప్రజెంట్ చేసేలా ఈ టైటిల్‌ ఉంది. పోస్టర్‌లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్‌, లెదర్ జాకెట్‌, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. భుజంపై వెపన్‌తో రౌడీ, గ్యాంగ్‌స్టర్ తరహా వైబ్‌ను తీసుకొచ్చారు. ఆయన సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్‌లోని పవర్‌ను మరింత ఎలివేట్ చేశాయి. టైటిల్ గ్లింప్స్‌ బాలకృష్ణ క్యారెక్టర్ పవర్‌, ఆరాను ప్రజెంట్ చేస్తూ ఆయనను ‘షేర్’ (సింహం)గా సంబోధించే వాయిస్‌ఓవర్‌తో వీడియో ఓపెన్ అవుతుంది. పోలీస్ అధికారులు ఆయనను చుట్టుముట్టి ఛాతిలో కాల్చేస్తామని హెచ్చరిస్తారు. ‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్‌కి బలుపు, గన్స్‌కి గట్స్ ఉండాలి’ అని బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌ అదిపోయింది, ఈ సీక్వెన్స్‌ అభిమానులను, మాస్ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. ‘దాదా’ డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్‌తో పాటు ముందస్తు న్యూ ఇయర్ ట్రీట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.‘దాదా’లో మంచు మనోజ్‌, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అరవింద్‌ ఎస్. కశ్యప్‌, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్. థమన్ పనిచేస్తున్నారు. ఏఎస్. ప్రకాశ్‌ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్‌ రాశారు. రామ్-లక్ష్మణ్‌, రవి వర్మ, వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.