‘ఇరుముడి’ చూస్తుంటే కళ్లు చెమర్చాయి. సక్సెస్ మీట్ లో హీరో రవితేజ
Irumudi
మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా రవితేజ మాట్లాడుతూ డైరెక్టర్ శివ ఈ సినిమా కోసం చాలా మంచి ఆర్టిస్టులను ఎంచుకున్నారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ మ్యూజిక్‌తో ఆటోమేటిక్‌గా ప్రేక్షకులకు కళ్లలో నీళ్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయి మోక్ష కూడా ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి వాళ్లు పడుతున్న ఆనందం మాటల్లో చెప్పలేను. వాళ్లతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కోవిడ్ తమిళ్ మలయాళ సినిమాలు ఎక్కువగా చూశాం. అవన్నీ రూటెడ్‌గా ఉండేవి. అలాంటి కంటెంట్ చూస్తున్నప్పుడు మన దగ్గర కూడా ఇలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది కదా అనిపించేది. ‘ఇరుముడి’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం థియేటర్‌కి వచ్చిన వాళ్లు మళ్లీ ‘ఇరుముడి’ సినిమా చూడడానికి థియేటర్‌కి రావడం కూడా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఈ ఆనందం మామూలుది కాదు. నాది రాతి గుండె. నాకు సాధారణంగా ఏడుపు రాదు. అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్చేశాను. డైరెక్టర్ త్రినాథ్ పాత్ర, ‘ఇరుముడి’ అనే టైటిల్ చెప్పగానే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తనది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇంత పెద్ద విజయం వచ్చినా సరే చాలా నార్మల్‌గా ఉంటాడు. ప్రియా భవాని శంకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాలో ఆ ఎమోషన్ పండడానికి తను సెకండ్ హాఫ్‌లో చేసిన ఆ రెండు సీన్స్ ఎంతగానో హెల్ప్ అయ్యాయి. అలాగే బేబీ నక్షత్ర అద్భుతంగా చేసింది. తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అన్నారు. ఈ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రియా భవాని శంకర్ , బేబీ నక్షత్ర , నిర్మాత రవిశంకర్ , నిర్మాత నవీన్ ఎర్నేని సాయికుమార్, అనంత శ్రీరామ్, సాశ్విక, డీఓపీ విష్ణు శర్మ పాల్గొన్నారు.
- Godavari Flood Surge at Polavaram: పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గేట్లు ఎత్తి వరద నీటి విడుదల
- EPFO Rules for Dual Employment: రెండు కంపెనీల్లో పనిచేస్తే PF ఎలా జమ అవుతుంది? EPFO క్లారిటీ
- ‘ఇరుముడి’ చూస్తుంటే కళ్లు చెమర్చాయి. సక్సెస్ మీట్ లో హీరో రవితేజ
- ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ రిలీజ్ చేసిన నాగార్జున
- కులం కాదు… మనిషే కేంద్రంగా సమానత్వం, సామాజిక న్యాయం