‘మార్కిస్ట్ చరిత్రకారుడు’ సుమిత్ సర్కార్
'Marxist historian' Sumit Sarkar
జెజెసిపి బాబూరావు
ఆధునిక చరిత్ర రచనలో అందెవేసిన ప్రముఖ ‘మార్క్సిస్ట్ చరిత్రకారుడు’ సుమిత్ సర్కార్ తన 87 ఏళ్ల వయసులో ఈ ఆగస్టు 13 నాడు మరణించడం విషాదకరం. చరిత్ర నేపథ్యం ఉన్న కుటుంబంలో కలకత్తాలో సుమిత్ 1939 లో జన్మించారు. ఆయన తండ్రి సుశోభన్ చంద్ర సర్కార్, ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయంఐజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధకులుగా పనిచేసిన ప్రఖ్యాత చరిత్రకారుడు. ‘చారిత్ర’ జత కలిసిన కుటుంబంలో పెరగడం మూలంగా సుమిత్‌కు చిన్ననాటి నుండే చారిత్రక అవగాహనను పెంపొందించుకున్నారు. అదేవిధంగా సుమిత్ సర్కార్ మరో చరిత్ర ప్రొఫెసర్ అయిన తనికా సర్కార్‌ను వివాహం చేసుకోవడం తద్వారా వారి కుటుంబానికి ‘చరిత్ర’తో బంధం మరింత గాఢంగా పెనవేసుకుపోయింది. సుమిత్ కుటుంబంలో మొదటగా ఆధునిక, ఉదారవాద సామాజిక – మత సంస్కరణల సంప్రదాయం ఉండేది. కాని క్రమంగా ఆయన తండ్రి సుశోభన్ చంద్ర సర్కార్ అనుసరించిన వామపక్ష సిద్ధాంతాల ప్రభావం క్రమంగా ఆ కుటుంబంలో బలంగా కొనసాగింది. సుమిత్ కలకత్తా (నేటి కోల్‌కతా)లోని ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్రలో బిఎ (ఆనర్స్) పూర్తి చేశారు. అనంతరం కలకత్తా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్, పిహెచ్‌డి చేసి డాక్టరేట్ పట్టా పొందా రు. ఆ తర్వాత ఆ కలకత్తా విశ్వవిద్యాలయంలోనే ఆయన బోధించా రు. సుమిత్ 1974 నుండి 2004 వరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధించి విద్యార్థులను చరిత్ర పట్ల ఎంతగానో ప్రభావితం చేశారు. సుమిత్ అమెరికా, యూరప్‌లోని అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బెంగాల్ పునరుజ్జీవనం, ఆధునిక ఐరోపా చరిత్ర, చరిత్ర రచన ఆలోచనపై సుమిత్ సర్కార్ రచనలు చేశారు. ఆయన రచనలలో 1973 లో ప్రచురితమైన ‘ది స్వదేశీ మూమెంట్ ఇన్ బెం గాల్’ (1903- గ్రంథం మైలురాయి. ఆధునిక భారతదేశ చరిత్రకారుడిగా ఆయనకు ఈ పుస్తకం కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. బెంగాల్‌లోని జాతీయవాద ఉద్యమంపై ప్రముఖ గ్రంథం గా నిలిచిపోయింది. సుమిత్ రాసిన ‘మోడరన్ ఇండియా’ (1885 ను విద్యార్థులకు పాఠ్యపుస్తకమైంది. ఈ గ్రంథం ద్వారా శ్రామిక ప్రజల చైతన్యాన్ని ప్రజా పోరాటాల దిశగా మళ్లించడానికి కృషి చేశారు. అలాగే ‘రైటింగ్ సోషల్ హిస్టరీ’ (1998), ‘మిడిల్ క్లాస్ లీడర్‌షిప్ ఇన్ లేట్ కలోనియల్ ఇండియా: ప్రాబ్లమ్స్ అండ్ పర్స్‌స్పెక్టివ్స్ ఆఫ్ ఎ హిస్టరీ ఫ్రమ్ బిలో’ మొదలైన ప్రముఖ గ్రంథాలు ఆయన రచించారు. సుమిత్ తన భార్య తనికా సర్కార్‌తో కలిసి ‘విమెన్ అండ్ సోషల్ రిఫార్మ్ ఇన్ మోడరన్ ఇండియా: ఎ రీడర్’ (2007), ‘క్యాస్ట్ ఇన్ మోడరన్ ఇండియా’ (2013) తదితర పుస్తకాలకు సహ-సంపాదకత్వం వహించారు. సుమిత్ రచనలు వివిధ సామాజిక సమూహాలు, వర్గాలు, ప్రజా ఉద్యమాల అనుభవాల ద్వారా వలసవాదం, జాతీయవాదం, స్వాతంత్య్ర ఉద్యమాలను పరిశీలించడంలో ప్రముఖంగా నిలిచాయి. ఆ రకంగా విస్తృత సమూహాలను, సామాజిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని జాతీయవాదంపై ఆయన చేసిన కృషి అనన్యసామాన్యం. మార్క్సిస్ట్ చరిత్రకారుడిగా విస్తృతంగా పేరుగాంచిన సుమిత్ ‘రాజకీయ మా ర్పుల వెనుక ఉన్న సామాజిక శక్తులపై’ ప్రత్యేక ఆస క్తి కనబరిచారు. ఆ రకంగా ఆయన ఆలోచనల్లో సా మాజిక మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఎస్సేస్ ఆఫ్ ఎ లైఫ్‌టైమ్’ అనే గ్రంథంలో అణగారిన వర్గాల జీవితాలను సుమిత్ స్పృశించారు. ఆర్థిక వ్యవస్థకు భిన్నంగా సంస్కృతి, భావోద్వేగాలను లో తుగా పరిశోధించే అరుదైన చరిత్రకారుల లో సుమిత్ ఒకరు. ఫాసిస్ట్ శక్తులు చేసే చరిత్ర వక్రీకరణలను ఆయన రచనలు తిప్పికొట్టాయి. సుమిత్ 2003లో ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ సొసైటీ నుండి ‘సరిత్ చటర్జీ మెమోరియల్ అవార్డు’ స్వీకరించారు. 2004లో పొందిన రవీంద్ర పురస్కారాన్ని ఆయన 2007 లో వెనక్కి ఇచ్చారు. సుమిత్ తన రచనల్లో మాత్రమేగాక, నిజ జీవితంలోనూ యువత భావాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. సుమిత్ మరణం చారిత్రక పరిశోధనకు, ప్రపంచ ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు.