రాజీవ్ యువ వికాసం కోసం యువత ఎదురుచూపులు
Congress
ఆరు గ్యారంటీల హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఒక గ్యారంటీలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం కోసం నిరుద్యో గ యువత, విద్యార్థు లు ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. 2025 మార్చి 17 నుండి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరించగా, స్వయం ఉపాధి ద్వారా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతో లక్షలాదిమంది యువత తెలంగాణ వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకానికి మొత్తం 16,25,441 (సుమారు 16.23 లక్షలు) దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇబిసి వర్గాల యువతీ యువకులకు రూ.50,000 నుండి రూ.4లక్షల వరకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహా యం, రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రతి ప్రభుత్వంలో యువత కొరకు ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాల కొనసాగింపుగానే ఈ పథకానికి రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టారు. ఇది కొత్త పథకం కాదు. పేరు మాత్రమే కొత్తది.
రాజీవ్ యువ వికాసంకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయినప్పటికీ పథకం అమలు విషయంలో స్పష్టత లేకపోవడం యువతలో ఆందోళనకు కారణమవుతోంది. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీపై ఆధారపడి చిన్న వ్యాపారాలు, వాహనాలు, ఇతర ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు అనేక మంది యువత ముందుకు వచ్చారు. అయితే దరఖాస్తులు తీసుకున్న తర్వాత వాటి పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకులకు ప్రతిపాదనలు పంపడం, రుణాల మంజూరు, సబ్సిడీ విడుదల వంటి ప్రక్రియలు ఎప్పుడు పూర్తవుతాయనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసి కాలం గడుస్తున్నా పథకం అమలు కోసం ఎదురుచూడాల్సి వస్తోందని పలువురు యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దరఖాస్తులు తీసుకోవడం మాత్రమే కాదు..
లబ్ధి ఎప్పుడు?
ప్రభుత్వ పథకాలపై యువతలో నమ్మకం కల్పించాలంటే ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్ణీత కాలపరిమితిలో వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన తదుపరి ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని యువత కోరుతోంది. యువ వికాసం పథకం పారదర్శకంగా అన్ని వర్గాల యువతకు అందే విధంగా చూడాలి. ఈ పథకం ద్వారా యువకులు తన కాళ్ళ మీద తాను బ్రతికే విధంగా ఉండాలి.
లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు పూర్తి చేస్తారు? రుణాలు ఎప్పుడు మంజూరు చేస్తారు? సబ్సిడీ ఎప్పుడు విడుదల చేస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. దరఖాస్తుదారులకు వారి దరఖాస్తు ప్రస్తుత స్థితిని తెలుసుకునే అవకాశం కల్పించాలని యువత డిమా్‌ండ చేస్తున్నారు.
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు స్వయం ఉపాధి ఒక ముఖ్యమైన మార్గం. ఇలాంటి సమయంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని వేగంగా అమలు చేస్తే ఎంతోమంది యువత తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని యువత కోరుతోంది. ఈ పథకం నిరుపయోగం కాకుండా యువతలో నైపుణ్యతను పెంపొందించుటకు ఆర్థిక సహకారం తోపాటు
శిక్షణను ఇవ్వాలి.
ప్రభుత్వం మార్కెట్ అంటే తాము ఇచ్చిన రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ది పొందినవారికి వారు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వం మార్కెటింగ్ కల్పిస్తే యువత అభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుంది.
- CEC Resignation Row: జ్ఞానేశ్ రాజీనామా వరకు కదలను.. ఢిల్లీ రోడ్డుపైనే బైఠాయించిన రాహుల్
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?