ఉత్తర తెలంగాణలో ప్రయాణికుల రైళ్ల పట్ల నిర్లక్ష్యం
Indian Railways
నూకల మణిచంద్ర యాదవ్
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ ఎంతో విస్తీర్ణం కలిగి ఉన్నప్పటికీ, ఉత్తర తెలంగాణ ప్రజల రైల్వే అవసరాల పట్ల సంవత్సరాలుగా నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది. ప్రజలు కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపులు, అదనపు బోగీలు, మెరుగైన సౌకర్యాలు కోరితే ప్రతిసారి వినిపించే సమాధానాలు మూడు మాత్రమే ‘రైల్వే లైన్ రద్దీగా ఉంది’, ‘బొగ్గు రవాణాకు ప్రాధాన్యం’, ‘సింగిల్ లైన్’. సమస్యలకు పరిష్కారం చూపాల్సిన చో ట, ఇవే కారణాలను పదే పదే చెప్పడం ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయడమే. దక్షిణ మధ్య రైల్వే లోని హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల వారి ప్రాధాన్యత ప్రయాణికు లు కాగా, సికింద్రాబాద్‌లో వారి ప్రాధాన్యత రవాణా మాత్రమే.ప్రత్యేకించి సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో సి ర్పూర్ కాగజ్‌నగర్, భద్రాచలం రోడ్ మణుగూరు నుంచి చర్లపల్లి, సికింద్రాబాద్ లేదా లింగంపల్లి మార్గంలో కొత్త రైళ్లు నడపాలన్నా, రైళ్లను పొడిగించాలన్నా ఇదే సమాధానం వస్తోంది. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే లైన్ రద్దీగా ఉంది, కాజీపేట జంక్షన్ రోడ్ మార్గం బొగ్గు రవాణాకు కీలకమైనదని, కాజీపేట జం క్షన్ మార్గం బొగ్గు రవాణా, సిమెంట్, ఆటోమొబైల్స్, వ్యవసాయ సరుకు రవాణాకు కీలకమైనదని. దోర్నకల్ జంక్షన్ రోడ్ వరకు సింగిల్ లైన్ బొగ్గు రవాణా కీలకం అని చెబుతూ ప్రజల అవసరాల ను పక్కన పెడుతున్నారు. అయితే ఇదే సమయంలో బీబీనగర్ మార్గంలో కూడా సింగిల్ లైన్ ఉన్నప్పటికీ ప్రతిరోజూ నలభైకి పైగా ప్రయాణికుల రైళ్లు, బొగ్గు, సిమెంట్,ఆహార ధాన్యాలు (ఎఫ్‌సిఐ),ఇనుము పారిశ్రామిక వస్తువుల విజయవంతంగా నడుస్తున్నాయి. అక్కడ సాధ్యమైతే, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనే ప్రశ్నకు సమాధానం లేదు. నిలయం లేదా డిఆర్‌ఎం కార్యాలయానికి అధికారులను కలిసి వినతి పత్రం అందించేందుకు వెళితే, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుం ది.గ్రీవెన్స్ సమయాల్లో వెళ్లినా అధికారులను కలిసే అవకాశం దాదాపు ఉండదు. ‘అధికారి బిజీగా ఉన్నారు… డిస్పాచ్ సెక్షన్‌లో ఇవ్వండి’ అనే సమాధానమే వస్తుంది. విభాగంలో వినతి పత్రం సమర్పించినా, నెలలు గడిచినా ఎలాంటి స్పందన ఉండదు. కనీసం చర్యల పురోగతి తెలియజేయరు.ప్రజల సమస్యలు వినడానికి ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో లేకపోతే, ఆ వ్యవస్థ ఉద్దేశం ఏమిటి? ప్రజలు,ప్రయాణీకుల సంఘాలు, సాధారణ ప్రయాణీకులు అధికారులను నేరుగా కలిసి తమ సమస్యలు వివరించే అవకాశం కల్పించాలి. కేవలం ‘డిస్పాచ్‌లో ఇవ్వండి‘ అనే సమాధానంతో ప్రజల గొంతును అణచివేయకూడదు.ఆర్‌టిఐ దా పిజి మనం ఏదైనా అడిగితే, ‘Noted‘, ‘Will be examined’ వంటి మాటలు ఇప్పుడు అక్షరా లా ‘శాశ్వతంగా పెండింగ్’ లేదా ‘చెత్తబుట్టలో వేసినట్టే’ అనే అర్థం ఇస్తున్నాయి. ప్రజల సమస్యలను నిజంగా పరిష్కరించలేకపోతే ఆర్‌టిఐలు, పిజి (Public Grievance Portal) ఫిర్యాదులు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? కోవిడ్ కాలంలో నిలిపివేసిన అనేక రైళ్లు ఇతర డివిజన్లలో తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు రైళ్లు ఇప్పటికీ పునరుద్ధరించబడలేదు. ఉదాహరణకి కోవిడ్ ముందు మణుగూరు నుం డి ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు రైళ్లు నడిచేవి, దీంతో ప్రజలకు మంచి రైల్వే అనుసంధానం ఉండేది. అయితే, కోవిడ్ తర్వాత ప్రస్తుత పూర్తిగా భిన్నమైనది, ఇ ప్పుడు వారి ప్రాధాన్యత కేవలం బొగ్గు రవాణా మాత్ర మే, 30కి పైగా రవాణా రేకులు నడుస్తున్నాయి, కనీసం కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్ల గురించి అడిగితే, స మాధానం సింగిల్ లైన్, మా ప్రాధాన్యత బొగ్గు రవాణా అనే వస్తుంది. ముందు నడిచిన రైళ్లు ఇప్పుడు ఎందుకు పునరుద్ధరించడం లేదు? అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. భద్రాచలం రోడ్ సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతాల ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి, విశాఖపట్నం, బాసరా, ఢిల్లీ, బెంగళూరు, వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలు, నగరాలకు ప్రత్యక్ష రైలు సౌకర్యం కల్పించాలని కోరుతున్నా, ఇప్పటికీ ఎలాంటి కార్యాచరణ కనిపించడం లేదు. ప్రయాణికుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చిన రైల్వే అధికారులు, ప్రస్తుతం బొగ్గు సరుకు రవాణాకు (Coal Freight) మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు అవసరమై న రైలు సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారు. సరుకు రవాణా తో పాటు ప్రయాణికుల సౌకర్యానికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలని వినమ్రంగా కోరుతున్నాము. సికింద్రాబాద్- రోడ్డు మార్గంలో నడిచే రైళ్లకు అవసరమైన అదనపు బోగీలు కూడా కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇతర ప్రాంతాలకు ఇప్పటికే ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో రైళ్లు నడుస్తున్నాయి. కొత్త ఎల్‌హెచ్‌బి కోచ్‌లను కూడా కేటాయిస్తున్నారు. కా మేము అడిగితే మాత్రం ఒకటే సమాధానం కోచ్‌లు అందుబాటులో లేవు. ప్రాంతాల కు ఉన్న కోచ్‌లు మా ప్రాంతానికి ఎందుకు లేవు? ఇది కోచ్‌ల కొరతా, లేక మా ప్రాంతం పట్ల నిర్లక్ష్యమా?ప్రజలకు స్పష్టమైన సమాధానం కావాలి.. భారత్ పథకం కింద స్టేషన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ, ప్రయాణికులకు అవసరమైన రైళ్లు, బోగీలు, నిర్వహణ సదుపాయాలు కల్పించకపోతే ఆ అభివృద్ధి అ మిగిలిపోతుంది. రోడ్‌లో ఇప్పటి కే 14 కోచ్‌ల నిర్వహణకు అనువైన పిట్‌లైన్ సౌకర్యం ఉ న్నప్పటికీ దానిని సమర్థంగా వినియోగించడం లేదు. ప్రస్తుతం 24 కోచ్‌ల నిర్వహణకు తగిన పిట్‌లైన్ విస్తరణ అవసరం ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కూడా పిట్‌లైన్ ఏర్పాటు కోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా విజ్ఞప్తులు చేస్తున్నా ఇప్పటికీ ఫలితం లే దు. ప్రతి కొత్త రైళ్లు ప్రతిపాదనను ‘ప్రైమరీ నిర్వహణ సౌ కర్యం లేదు‘ అనే కారణంతో తిరస్కరించడం అభివృద్ధికి అడ్డంకిగా మారింది. వారు పిట్‌లైన్‌లు నిర్మించరు – కొత్త రైళ్లను ఇవ్వరు. మాకు పిట్‌లైన్‌లు నిర్మాణం పూర్తయితే వారు కొత్త రైళ్లు వస్తాయి
కాజీపేట రైల్వే డివిజన్
ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.కాజీపేట ఉత్తర, దక్షిణ ప్రాంతలు కలిపే ప్రధాన కూడలి. గ్రాండ్ ట్రంక్‌లోని ప్రధాన కూడలి. కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పడితే తెలంగాణ ఉత్తర, తూర్పు జిల్లాల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త రైళ్ల ప్రవేశం, రైళ్ల పొడిగింపులు, అదనపు బోగీల కేటాయింపు, పిట్‌లైన్‌లు, కోచ్ నిర్వహణ కేంద్రాలు, సరుకు రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలు వేగవంతమవుతాయి. అంతేకాకుండా వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఏర్పడటంతో పాటు ప్రాంతీ ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలు, పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. ప్రజలకు అవసరమైన నిర్ణయా లు స్థానిక స్థాయిలోనే తీసుకునే పరిపాలనా సామర్థ్యం పెరుగుతుంది. డివిజన్ అనేది కేవలం ఒక పరిపాలనా కార్యాలయం మాత్రమే కాదు; అది ఒక ప్రాంత అ భివృద్ధికి పునాది. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుతో పా టు ఉత్తర తెలంగాణ ప్రజల న్యాయమైన రైల్వే అవసరాలను తక్షణమే తీర్చాల్సిన బాధ్యత భారతీయ రైల్వేలు, దక్షిణ మధ్య రైల్వేపై ఉంది. ఇకపై ‘మార్గ సామర్థ్యం సరిపోదు’, ‘బొగ్గు రవాణా’, ‘ఒకే మార్గం’ అనే సాకులు కాకుండా, ప్రజలకు అవసరమైన రైల్వే సేవలు అందించే దిశగా స్పష్టమైన కార్యాచరణ ప్రారంభించాల్సిన సమ యం ఆసన్నమైంది.
- లఖింపూర్ హింసాకాండ కేసులో.. ఆశిష్ మిశ్రా బెయిల్ షరతుల సడలింపునకు ‘సుప్రీం’ నో
- తెహెల్కా పత్రిక మాజీ సంపాదకుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష… బాంబే హైకోర్టు తీర్పు
- వర్షాల కోసం తెలంగాణలో వరుణయాగం.. ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో ముహూర్తం ఫిక్స్
- Rahul Gandhi: బీజేపీ సర్కార్ నన్ను అడ్డుకోలేదు..’ఛాత్రోన్ కీ గూంజ్’ అనుమతి రద్దుపై రాహుల్ మండిపాటు
- పార్టీ విరాళాల స్వీకరణలో డీఎంకే టాప్…రూ. 140 కోట్లతో వైసీపీ 3వ స్థానం..టీడీపీది 4వ స్థానం