వీడియో ఇదిగో.. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.. మిత్రుడిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న హరీశ్ రావు..
harish Rao Tears
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ఆప్త మిత్రుడికి తుది వీడ్కోలు పలికేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్ రావు స్నేహితుడిని తలుచుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్న ఆయన.. సుదర్శన్ రెడ్డితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చివరి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు నర్సంపేటకు తరలివచ్చారు. అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. ఆయన పార్థివదేహం నర్సంపేటకు చేరుకున్నప్పటి నుంచి ప్రజలు బారులు తీరుతూ అశ్రునివాళి అర్పించారు.
అభిమానుల భారీ రద్దీ కారణంగా నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేసి పరిస్థితిని నియంత్రించారు. అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు.
- Harish Rao Farm House: అజీజ్‌నగర్ భూములపై కాంగ్రెస్ ఫీల్డ్ విజిట్.. కేటీఆర్, హరీశ్‌రావుపై చామల ప్రశ్నల వర్షం
- Harish Rao Farmhouse: అసైన్డ్ భూముల్లో ఫాం హౌస్ నిర్మించారు..అద్దంకి ఫైర్..హరీష్ రావు ఫాం హౌస్ భూముల్లో కాంగ్రెస్ నేతల ఫీల్డ్ విజిట్..
- Telangana Land Resurvey: భూముల రీ-సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. భూముల సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
- TIMS Hospital Theft: సనత్ నగర్ TIMS ఆసుపత్రిలో భారీ చోరీ.. 288 వైద్య పరికరాలు మాయం, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు
- Singareni Workers Land Issue: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం, 45 రోజుల్లో పరిష్కారం