Peddi Sudarshan Reddy: నర్సంపేటకు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ నేతలు..ఎవరేమన్నారంటే..
Peddi Sudarshan Reddy (1)
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికకాయం నర్సంపేటకు చేరుకుంది. కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు అశ్రునివాళులు అర్పించారు.
Peddi Sudarshan Reddy: తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం నర్సంపేటకు చేరుకుంది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు అభిమానులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ప్రియతమ నాయకుడిని చివరిసారిగా చూసి పలువురు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన మరణంతో నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
బీఆర్ఎస్ అగ్రనేతల గాఢ సానుభూతి:
కేటీఆర్ (బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్): పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆసుపత్రి నుంచి కోలుకుని తిరిగి వస్తారని ఆశించాం. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. ఉద్యమ ఆశయాలను నమ్మి, ప్రజల పక్షాన నిలబడి పనిచేసిన ఆయన మరణం పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరారు.
తన్నీరు హరీశ్ రావు (డిప్యూటీ ఫ్లోర్ లీడర్): మంచి మనసున్న ఉద్యమ సహచరుడు, ఆత్మీయ సోదరుడు పెద్ది సుదర్శన్ అన్నను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరని బాధ. మృత్యువును జయించి వస్తారనుకున్నాం, కానీ ఆయన లేరనే వార్తను జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిన పోరాట యోధుడిగా ఆయన ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు. పెద్ది అన్నకు నా జోహార్లు అని అన్నారు.
వేముల ప్రశాంత్ రెడ్డి (మాజీ మంత్రి, ఎమ్మెల్యే): తెలంగాణ సమాజం ఒక గొప్ప ఉద్యమ నాయకుడిని కోల్పోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ తరఫున అన్ని ప్రయత్నాలు జరిగాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన ఆయన, ప్రజల సమస్యలనే తన రాజకీయ అజెండాగా మలుచుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకసంద్రంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉంటాయని నేతలు భరోసా ఇచ్చారు.
- భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ వార్.. ప్రధాని మోదీ రాకకు ముందే బలాన్ని చాటిన జగన్.. కూటమిలో కొత్త గుబులు..
- రైలులో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా? భారత రైల్వే కొత్త రూల్స్ తెలుసుకోండి
- ఏపీలో కూటమికి బీటలు…టీడీపీ, వైసీపీలను ఒకేసారి ఎన్నికల్లో ఓడించిన జనసేన…ఇది దేనికి సంకేతం…
- Peddi Sudarshan Reddy: నర్సంపేటకు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహం.. అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బీఆర్ఎస్ నేతలు..ఎవరేమన్నారంటే..
- భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం