Viral Video: జంతర్ మంతర్ దగ్గర స్విగ్గీ, జొమాటో ఏజెంట్ల క్యూ.. వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే…
Viral Video: జంతర్ మంతర్ దగ్గర స్విగ్గీ, జొమాటో ఏజెంట్ల క్యూ.. వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే...
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ చేస్తున్న ఉద్యమం కొత్త కొత్త ఆవిష్కరణలకు సాక్షిగా నిలుస్తోంది. ఓవైపు బిజెపి ఐటి సెల్ ఈ ఉద్యమం వెనుక చైనా ఉందని, పాకిస్తాన్ ఉందని తప్పుడు ప్రచారం చేస్తుంటే… మరోవైపు దేశ ప్రజలు మాత్రం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా జంతర్ మంతర్ వద్ద వరుసగా స్విగ్గి జొమాటో డెలివరీ బాయ్స్ ఆహారపు ప్యాకెట్లతో కనబడుతున్నారు. వీరందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారంటే దేశవ్యాప్తంగా ఎవరైతే జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు వారంతా విద్యార్థుల కోసం స్విగ్గి జొమాటో ఉపయోగించి ఆహారాన్ని బుక్ చేస్తున్నారు. డెలివరీ బాయ్స్ ఈ ఆహారాన్ని ఎవరికీ ఇవ్వాలి అని బుక్ చేసిన వారికి ఫోన్ చేసి అడగగా ఎవరు ఆకలిగా కనిపిస్తే వారికి ఇమ్మని చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మద్దతుదారులు తెలుపుతున్నటువంటి ఈ సంఘీభావానికి సోషల్ మీడియా మొత్తం ఈ వార్త హల్చల్ గా మారింది అని చెప్పవచ్చు.
ప్రముఖ రిపోర్టర్ అజిత్ అంజుమ్ తన సోషల్ మీడియా ఖాతాలో స్విగ్గి జొమాటో డెలివరీ బాయ్స్ కు సంబంధించిన వీడియోను అప్లోడ్ చేశారు. ఇందులో సదరు వార్తా విలేకరి స్విగ్గి జొమాటో బాయ్స్ ను ఆపి మిమ్మల్ని ఎవరు పంపారు అని అడిగితే వారంతా తమకు తెలియదని, దేశంలో వివిధ మూలల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని వారంతా జంతర్ మంతర్ లొకేషన్ సెలెక్ట్ చేసి ఆహారాన్ని బుక్ చేస్తున్నారని, ఎవరికీ ఈ ఆహారాన్ని డెలివరీ చేయాలని అడిగితే ఎవరు ఆకలిగా కనిపిస్తే వాళ్ళకి ఇమ్మని చెబుతున్నారని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. జంతర్ మంతర్ వద్ద సాగుతున్నటువంటి ఈ పోరాటం ఒకసారి కొత్త రూపాన్ని సంతరించుకుంది అని చెప్పవచ్చు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా దేశవ్యాప్తంగా మద్దతుదారులు ఈ విధంగా సంఘీభావం తెలపడం ఇది ఒక కొత్త అధ్యాయానికి తెర లేపుతోందని సదరు వార్తా విలేకరి రిపోర్టు చేశారు.