Skip to content
జాతీయం వార్తలు

PM Narendra Modi: నేను 56 ఏళ్ల యువకుడి గురించి చెప్పడం లేదు.. ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా చమత్కరించిన ప్రధాని మోదీ..స్కైరూట్ స్టార్టప్‌ను ప్రశంసించిన ప్రధాని..

Prajapaksham 20 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
PM Narendra Modi: నేను 56 ఏళ్ల యువకుడి గురించి చెప్పడం లేదు.. ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా చమత్కరించిన ప్రధాని మోదీ..స్కైరూట్ స్టార్టప్‌ను ప్రశంసించిన ప్రధాని..

PM Narendra Modi: నేను 56 ఏళ్ల యువకుడి గురించి చెప్పడం లేదు.. ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా చమత్కరించిన ప్రధాని మోదీ..స్కైరూట్ స్టార్టప్‌ను ప్రశంసించిన ప్రధాని..

PM Narendra Modi పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశీయ అంతరిక్ష రంగంలో భారతీయ యువత సాధిస్తున్న విజయాలపై హర్షం వ్యక్తం చేశారు. దేశ శ్రేయస్సుకు వర్షాకాల సమృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్‌ సమావేశాలు కూడా అంతే ఫలవంతంగా సాగాలని ఆకాంక్షించిన ప్రధాని, ఇదే సమయంలో దేశీయ స్టార్టప్ స్కైరూట్ (Skyroot) సాధించిన అపూర్వ ఘనతను ప్రత్యేకంగా కొనియాడారు.

అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన స్కైరూట్ స్టార్టప్‌లో పనిచేస్తున్న యువ శాస్త్రవేత్తల సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమేనని మోదీ వెల్లడించారు. ఇంత చిన్న వయసులోనే యువత అంతరిక్షంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించడం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. ఇదే తరుణంలో ప్రతిపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా చమత్కరిస్తూ.. నేనిక్కడ 56 ఏళ్లయువకుడి గురించి మాట్లాడటం లేదు.. నిజమైన యువ శాస్త్రవేత్తల ప్రతిభను ప్రస్తావిస్తున్నానని వ్యాఖ్యానించారు.

గత ఏడాది రుతుపవనాల సమావేశాలకు కొద్ది రోజుల ముందే ఒక భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తాజాగా ప్రైవేట్ రంగంలో భారతీయ యువత సాధించిన ఈ ప్రగతి అంతర్జాతీయ వేదికపై దేశ స్థాయిని మరింత పెంచిందని ప్రధాని అన్నారు.

ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఇలాంటి ప్రైవేట్ రంగ అంతరిక్ష కృషిని చూశాయని ఆయన పేర్కొన్నారు. ఈ విజయాలు యాదృచ్ఛికంగా వచ్చినవి కావని, మన దేశ యువత యొక్క సామర్థ్యాలు, ఆశయాలు అంతరిక్షం అంత అనంతమైనవి అని చాటిచెప్పే ఒక శక్తివంతమైన సందేశమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.