Skip to content
వినోదం వార్తలు

జూలై 24న హే చికితా విడుదల

Prajapaksham 20 Jul 2026 0 నిమిషాల పఠనం వినోదం
జూలై 24న హే చికితా విడుదల

hey-chikitha

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి
చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కమెడియన్ అలీ, వీఎన్ ఆదిత్య, ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ‘లైలా’ మూవీని చేశాను. ఆడియో రైట్స్‌తోనే ఎంతో లాభం వచ్చింది. ‘హే చికీతా’ టీంని చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి అన్నారు.
కమెడియన్ అలీ మాట్లాడుతూ ‘బద్రి’ సినిమాలోని ‘హే చికీతా’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ చిత్రాన్ని తీయడం, రిలీజ్ చేయడం ఎంతో కష్టం. భవిష్యత్తులో రైతు అనేవాడు ఉంటాడా? కనిపిస్తాడా? అని అనిపిస్తుంది. రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ ‘‘పల్లెటూరులో చాలా ప్రేమ కథలుంటాయి. ‘హే చికీతా’ పోస్టర్‌ని చూస్తే మా ఊర్లో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి. రైతు పంట పండిస్తేనే మనం ఇలా జీవిస్తున్నాం. రైతే రాజు అనే కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రం మంచి విజయం దక్కాలి’ అని అన్నారు.
గరుడవేగ అంజి మాట్లాడుతూ ‘హే చికీతా’ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీని జూలై 24న రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.
నిర్మాతఎన్. అశోక ఆర్ఎన్ఎస్ మాట్లాడుతూ ధన్ రాజ్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. అంజితో కలిసి సినిమాని చేయడం ఆనందంగా ఉంది. చరణ్ అర్జున్ పాటలు అద్బుతంగా ఉన్నాయి. జూలై 24న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ హే చికీతా ఇది నా తొలి చిత్రం. చాలా మంచి సినిమా చేశాను. రైతులు, యూత్ కోసం ఈ మూవీని చేశాను. ఈ కార్యక్రమంలో దివిజ ప్రభాకర్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్,
నటి యోధ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు: Hey Chikitha movie news