Skip to content
వినోదం వార్తలు

చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్

Prajapaksham 20 Jul 2026 0 నిమిషాల పఠనం వినోదం
చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ చేసిన అల్లు అరవింద్

Allu Aravind releases the 'Chennai Love Story' trailer.

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ అతిథులుగా పాల్గొన్నారు. అల్లు అరవింద్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ రవిశంకర్ బర్త్ డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా ట్రైలర్ చూస్తే, అందులోని భావోద్వేగాలు గమనిస్తే ఇది డెఫనెట్ గా హిట్ అయ్యే సినిమా అనే ఇంప్రెషన్ కలుగుతోంది. అందులో అనుమానమేమీ లేదు. ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. కానీ ట్రైలర్ చూశాక ఇది తప్పకుండా అలాంటి విజయం సాధిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఈ నెల 24న ఈ టీమ్ అందరికీ ఒక మంచి విజయం దక్కబోతోంది. వీళ్లందరికీ మంచి గుర్తింపు దక్కుతాయి. మైత్రీ రవి ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు అన్నారు.