న్యూటన్స్ థర్డ్ లా సాంగ్ రిలీజ్
'Newton's Third Law' song released.
సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ధమ్ ధమ్ సాంగ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ ‘న్యూటన్స్ థర్డ్ లా’ కథను ఒకే సిట్టింగ్‌లో ఓకే చేశాను. ‘అనగనగా’ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కథ విన్న వెంటనే వినయ్ పాత్ర, కార్తీక్ పాత్ర చాలా బలంగా ఉండాలని చెప్పాను. ఆ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటేనే సినిమా ఆడుతుందని అప్పుడే అనుకున్నాను. నిజంగానే ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఈ పాట కూడా వాళ్ల పాత్రలపైనే ఉంటుంది. సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అనగనగాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగాఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలా మంచి సినిమాతో వస్తున్నాం. సినిమా విషయంలో మేమంతా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ న్యూటన్స్ థర్డ్ లా జూలై 31న జూలై 31న థియేటర్లలో విడుదల అవుతుంది అన్నారు.
దర్శకుడు రాజేష్ కర్ణ మాట్లాడుతూ ఈటీవీ విన్ ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి సహకారం అందించింది. వారి గట్స్, సినిమాపై ఉన్న ప్యాషన్ అభినందనీయం. థ్రిల్లర్ జానర్ గురించి మాట్లాడినప్పుడల్లా ‘న్యూటన్స్ థర్డ్ లా’ పేరు కూడా తప్పకుండా వినిపిస్తుంది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌ను రీడిఫైన్ చేస్తుంది. సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి మాట్లాడుతూ కృష్ణ చైతన్య అద్భుతమైన సాహిత్యం రాశారు.ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.
నిర్మాత కె. హరీష్ మాట్లాడుతూ మేము చాలా మంచి సినిమా తీశాం. ఈ కథ నా దగ్గరకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పారు.