Skip to content
వినోదం వార్తలు

Lenin బాక్సాఫీసు పై లెనిన్ దండయాత్ర..తొలి రోజే రూ.16.7 కోట్ల గ్రాస్ తో క్లీన్ హిట్

Prajapaksham 11 Jul 2026 0 నిమిషాల పఠనం వినోదం
Lenin బాక్సాఫీసు పై లెనిన్ దండయాత్ర..తొలి రోజే రూ.16.7 కోట్ల గ్రాస్ తో క్లీన్ హిట్

Lenin బాక్సాఫీసు పై లెనిన్ దండయాత్ర..తొలి రోజే రూ.16.7 కోట్ల గ్రాస్ తో క్లీన్ హిట్ ( Image Source: X.com)

ఎట్టకేలకు అక్కినేని అఖిల్ దశాబ్ద కాలం తర్వాత తొలి హిట్టు అందుకున్నాడు. లెనిన్ సినిమా తొలి ఆట నుంచే మంచి టాక్ సంపాదించడంతో`తెలుగు రాష్ట్రాల్లో చక్కటి వసూళ్లు వస్తున్నాయని, నిర్మాత సూర్యదేవరన నాగ వంశీ సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు అంతేకాదు సినిమా తొలి రోజు కలెక్షన్స్ అంచనాలకు మించి రావడం విశేషం అఖిల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుంటే లెనిన్ సినిమాకు వచ్చిన తొలి రోజు కలెక్షన్స్ ఊహకు అందని రేంజ్ అని చెప్పవచ్చు. తొలి రోజు సుమారు 16.7 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్ టైన్ మెంట్స్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. లెనిన్ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ తో మొదటి రోజు దూసుకెళ్లింది అని చెప్పవచ్చు ఎందుకంటే అఖిల్ నటించిన చివరి చిత్రం ఏజెంట్ మూడేళ్ల క్రితం రిలీజ్ అవ్వగా ఆ సినిమా టోటల్ రన్ కేవలం 6 కోట్లు మాత్రమే లభించగా, ఇప్పుడు అఖిల్ నటించిన ఈ లెనిన్ సినిమా మొదటి రోజే 7 కోట్లకు పైగా షేర్ అందుకోవడంతో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నెలకొని ఉంది అని చెప్పవచ్చు.

టీ2బి వెబ్ పోర్టల్ పోెస్ట్ చేసిన లెక్కల ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో లెనిన్ మొదటి రోజే 8.80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా నైజాంలో లెనిన్ తొలిరోజు 1.78 కోట్ల రూపాయల షేర్ అందుకున్నాడు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 5.50 కోట్ల రూపాయల షేర్ అందుకోవడం లెనిన్ సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే దాదాపు 1.40 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపు 36 లక్షల రూపాయలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో షేర్ సాధించినట్లు తెలుస్తోంది. దీని బట్టి చూసినట్లయితే వరల్డ్ వైడ్ గా అఖిల్ నటించిన లెనిన్ సినిమా 13.10 కోట్ల రూపాయల గ్రాస్ సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అఖిల్ నటించిన గత చిత్రాలతో పోల్చి చూస్తే చాలా భిన్నమైనది అని చెప్పవచ్చు. సినిమాకు మొదటి నుంచి కూడా చక్కటి పాజిటివ్ వైబ్ రావడంతోపాటు అంచనాలకు తగ్గట్టుగా అఖిల్ పర్ఫామెన్స్ కూడా సినిమాకు యాడ్ అయిందని చెప్పవచ్చు.

ఇక లెనిన్ సినిమా రెండో రోజు కూడా అదే స్థాయిలో కుమ్ముడు కుమ్ముతున్నట్లు చూడవచ్చు ఎందుకంటే రెండో రోజు రెండవ శనివారం హాలిడే కావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక వీకెండ్ సండే లెనిన్ సినిమాకు పోటీ ఏదీ లేకపోవడంతో టోటల్ రికవరీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే షోస్ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు, తెలుస్తోంది మొత్తానికి అయ్యగారు అఖిల్ ఎట్టకేలకు తొలి హిట్ అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.