పవన్ కళ్యాణ్ అయోధ్య మెట్లు ఎందుకు కడగరు..అన్ అపాలజిటిక్ హిందూ చేసే పని ఇదేనా..?
పవన్ కళ్యాణ్ అయోధ్య మెట్లు ఎందుకు కడగరు..అపాలజిటిక్ హిందూ చేసే పని ఇదేనా..?
తిరుమలలో లడ్డు ఇష్యూ విషయంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాద్ధాంతం ఇప్పటికీ యూట్యూబ్లో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. తాను సనాతన ధర్మానికి ఛాంపియన్ అని కాషాయ బట్టలు కట్టుకొని విజయవాడలోని దుర్గ గుడి మెట్లను కడిగి ఒక్కోమటుకు బొట్లు పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ చివరకు తిరుమల లడ్డు ఇష్యూపై 2026లో వచ్చిన CBI-SIT ఛార్జ్‌షీట్, దర్యాప్తులో నెయ్యిలో జంతు కొవ్వు ఉందనేందుకు ఆధారాలు లేవని తేల్చింది. కానీ ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు బిజెపి చెబుతున్న సనాతన ధర్మానికి బ్రాండ్ అయినా అయోధ్య గుడిలోనే ఏకంగా అవకతవకలు జరిగాయి. ఆలయ ట్రస్టీలు అవినీతికి పాల్పడి హుండీ డబ్బులను బంగారం కానుకల్లో పెద్ద కుంభకోణం చేశారు. తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి. అటు యూపీలో, కేంద్రంలో బిజెపి సర్కారే అధికారంలో ఉంది. అయోధ్య గుడి నిర్మాణం మొత్తం తమ ఆధ్వర్యంలోనే జరిగిందని ఆ క్రెడిట్ అంతా తమకే దక్కాలని బిజెపి దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం అవినీతి మరకలు అంటడంతో ఏం చేయాలో తెలియక అటు బిజెపి ఆర్ఎస్ఎస్ రెండో కూడా కక్కలేక మింగలేక అనే పరిస్థితుల్లో ఉన్నాయి. తిరుమల లడ్డు విషయంలో అదిగో పులి ఇదిగో తోక అంటూ రాద్ధాంతం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అయోధ్య రామాలయం హుండీ డబ్బుల అవినీతిపై ఏమాత్రం నోరు మెదపడం లేదని నెటిజెన్లు విమర్శిస్తున్నారు.
తనకు తాను సనాతన ధర్మం ఛాంపియన్గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ అయోధ్య గుడి విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని . సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు “అన్ అపాలజిటిక్ హిందూ” అని సనాతని అంటూ ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ కు అయోధ్య రాముడు కనిపించకపోవడం ఆయన కష్టాలు గుర్తించకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్లో హిందువుల గురించి, సాధువుల గురించి ట్వీట్లు చేసే పవన్ కళ్యాణ్ అయోధ్యలో కళ్ళముందే బాల రాముడి సొమ్మంతా బొక్కేసిన పందికొక్కులను చూసి చూడనట్లు వదిలేయడం అన్ అపాలజిటిక్ హిందూ లక్షణమా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంలో పీహెచ్డీ చేసినట్లు ఎప్పటికప్పుడు లెక్చర్లు దంచుతుంటారు అని, ఇప్పుడు అయోధ్య గుడిమెట్లను కూడా వచ్చి కడిగి అలాగే కడిగితే అందరూ సంతోషిస్తారని అప్పుడు “అన్ అపాలజిటిక్ హిందూ” అనే పదానికి సార్ధకం కూడా అవుతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై జనసేనాని ఏం చేస్తాడో ఎదురు చూడాలి.