Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం…తెలంగాణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు…
Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం...తెలంగాణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు...
ఈనెల 12వ తేదీ నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా తెలంగాణ ఛత్తీస్గడ్ ఒడిశా లో వర్షాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణ ఏర్పడినప్పటికీ పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎండా పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా నమోదవుతుండగా రానున్న 24 గంటల్లో తెలంగాణ కోస్తా ప్రాంతాల్లో చదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం..
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.