EPF Complete Guide: ఈపీఎఫ్ఓ గురించి ప్రతీ ఉద్యోగి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..A to Z
EPF Complete Guide: ఈపీఎఫ్ఓ గురించి ప్రతీ ఉద్యోగి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
మన దేశంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనది ప్రావిడెంట్ ఫండ్ ఇది కేవలం రిటైర్మెంట్ ఫండ్ అనుకుంటే పొరపాటే. అత్యవసర సమయాల్లో కూడా ఆదుకునే ఒక ఆర్థిక నిధి. చాలామంది ఉద్యోగులు ప్రతినెలా తమ వేతనంలో పిఎఫ్ ఎందుకు కట్ అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి పిఎఫ్ అనేది అత్యవసరమైన నిధి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు అది ఎంతగానో తోడ్పడుతుంది. మన దేశంలో పిఎఫ్ ఖాతాలను ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. . ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ. దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఈ సంస్థ బోర్డు మెంబర్లు పిఎఫ్ నిధుల వినియోగం వడ్డీరేట్లు నిర్ణయిస్తారు. ప్రావిడెంట్ ఫండ్ విషయంలో చాలామంది ఉద్యోగులకు అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రతి నెలా మీ జీతం నుండి కట్ అయ్యే ఈ పిఎఫ్ డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? కంపెనీ ఎంత జమ చేస్తుంది? దీని రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
ఈపీఎఫ్ (EPF) అంటే ఏమిటి? కాంట్రిబ్యూషన్ రూల్స్
ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ దీన్నే ఉద్యోగుల భవిష్య నిధి అని పిలుస్తారు ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహిస్తుంది. EPFO (Employees’ Provident Fund Organisation) ఉద్యోగుల కోసం ఉద్దేశించిన ఒక దీర్ఘకాలిక పొదుపు పథకం ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర సమయాల్లో ఉద్యోగి అతని కుటుంబం ఆర్థిక భద్రతను కాపాడేందుకు ఉద్దేశించిన పథకమే ఈపీఎఫ్. సాధారణంగా 20 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నటువంటి ప్రతి గుర్తింపు పొందిన సంస్థ ఈపీఎఫ్ పరిధిలోకి వస్తుంది. . అంతేకాదు నెలకు 15 వేల లోపు శాలరీ ఉన్న ఉద్యోగులకు తప్పనిసరిగా పీఎఫ్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రెండు వాటాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగి తరపున ఒక వాటా జమ అవుతుంది. రెండోవాట యాజమాన్యం తరపున ఉద్యోగి బేసిక్ శాలరీలో 12% కంపెనీ తరఫున ఈపీఎఫ్ నిధికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే యాజమాన్యం వాటాలో పూర్తిగా 12% ఒకే ఖాతాలోకి వెళ్లదు అందులో ఈపీఎస్ పెన్షన్ స్కీం కింద 8.33% ఉద్యోగి పెన్షన్ ఫండ్ కు వెళ్తుంది. మిగతా మొత్తం 3.67% పిఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. ఇది కాకుండా కంపెనీ తరఫునుంచి 0.5% ఉచిత ఇన్సూరెన్స్ స్కీం కోసం ప్రీమియం చెల్లిస్తారు.
UAN యాక్టివేషన్..
ఈపీఎఫ్ఓ సభ్యుడు అయినటువంటి ప్రతి ఉద్యోగికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కేటాయిస్తారు దీనినే యూఏఎన్ అని పిలుస్తారు ఇది 12 అంకెల ప్రత్యేకమైన సంఖ్య దీన్ని ఉపయోగించి ఒక ఉద్యోగి తన పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు డబ్బులు డ్రా చేసుకోవడం అలాగే ఇతర అన్ని కార్యకలాపాలకు ఈ యుఏఎన్ నెంబర్ అనేది తప్పనిసరి నెంబర్ ఆన్లైన్ లో ఆక్టివేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే. పిఎఫ్ అనేది యాక్టివేట్ అవుతుంది.