Aadhaar Complete Guide: ఆధార్ కార్డు గురించి A to Z వివరాలు మీ కోసం…అప్‌డేట్స్
Aadhaar Complete Guide: ఆధార్ కార్డు గురించి A to Z వివరాలు మీ కోసం...అప్‌డేట్స్
Aadhaar అంటే ఏమిటి?: భారతదేశంలో ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ద్వారా జారీ చేసే పన్నెండు అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. చాలా మంది ఆధార్ కార్డు అంటే అది ఒక డాక్యుమెంట్ అనుకుంటారు కానీ నిజానికి అది ఒక సంఖ్య ఈ సంఖ్య లోనే పౌరులకు సంబంధించిన బయోమెట్రిక్స్ సహా పలు వివరాలు నమోదు అయి ఉంటాయి. ఆధార్ నెంబర్ ద్వారా పౌరులకు సంబంధించిన గుర్తింపు అనేది రుజువు చేసుకోవడానికి దోహదపడుతుంది ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అనేది చాలా బలమైన గుర్తింపు డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. దీంతోపాటు బయోమెట్రిక్స్ కూడా నమోదు చేయడం ద్వారా పౌరులకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం వద్ద నిక్షిప్తమై ఉంటాయి. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం సబ్సిడీలు, పెన్షన్లు, స్కాలర్షిప్స్ ఇయ్యడానికి ఆధార్ నెంబర్ ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పవచ్చు. దీంతోపాటు బ్యాంకు అకౌంటు ఓపెన్ చేయడానికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక టాక్స్ ఫైల్ చేయడానికి తప్పనిసరిగా పర్మినెంట్ అకౌంట్ నెంబర్ తో పాటు ఆధార్ కార్డును కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆధార్ కార్డు అనేది పౌరులకు ప్రభుత్వం అందించే అనేక సేవల కోసం ఉపయోగపడుతుంది.
Aadhaar ఎలా తీసుకోవాలి? :
ఆధార్ కార్డును పౌరులు మీ సమీపంలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్ వద్దకు వెళ్లి మీ నివాస ధ్రువీకరణ పత్రం, మీ జన్మ ధృవీకరణ పత్రం లేదా మీ ఇతర ధ్రువీకరణ పత్రాలను తీసుకొని వెళ్లి ఆధార్ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బయోమెట్రిక్స్ అలాగే ఫోటో కూడా ఆధార్ నమోదు సందర్భంగా స్వీకరిస్తారు. అనంతరం మీకు అకనాలెడ్జిమెంట్ లభిస్తుంది ఆ తర్వాత పోస్టల్ ద్వారా ఆధార్ కార్డు మీ ఇంటికి చేరుతుంది. ఈ ఆధార్ కార్డును మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు
Aadhaar Download ఎలా?:
mAadhaar అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీ సమీపంలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లి మీ ఆధార్ నెంబర్ చెప్పి అనంతరం బయోమెట్రిక్ ఎంటర్ చేయడం ద్వారా డూప్లికేట్ కార్డును పొందవచ్చు.
Mobile Number Update ఎలా?:
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం అనేది తప్పనిసరి. ముఖ్యంగా అనేక ప్రభుత్వ కార్యకలాపాలకు ఆధార్ ఫోన్ నెంబర్ అప్డేట్ అనేది ఈ మధ్యకాలంలో తప్పనిసరి అయింది. ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా కూడా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఉండాలి. అలాగే పిఎం కిసాన్ యోజన డబ్బులు పడాలన్నా కూడా ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఉండాలి. దీంతో పాటు అనేక ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ ఆధారిత ఓటిపి అవసరం అవుతుంది. అందుకే తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి.
Address Change ఎలా?:
ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ కోసం మీ సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ వద్దకు వెళ్లి మీరు కొత్తగా ఏ అడ్రస్ అయితే ఎంపిక చేసుకున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, గెజిటెడ్ సంతకం చేసిన డాక్యుమెంట్ ద్వారా మీరు అడ్రస్ . చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
PVC Card ఎలా ఆర్డర్ చేయాలి?:
మీరు ఎం ఆధార్ యాప్ ద్వారా పివిసి కార్డును అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దీనికోసం మీరు ప్రత్యేకంగా రుసుము చెల్లించాలి.
Aadhaar Lock/Unlock ఎలా?:
మీరు ఎం ఆధార్ ద్వారా మీ బయోమెట్రిక్స్ లాక్ చేసుకుని అవకాశం ఉంటుంది. తద్వారా మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు
e-Aadhaar అంటే? :
ఈ ఆధార్ అనేది ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డు. దీన్ని మీరు ఎం ఆధార్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నిక్షిప్తం చేసుకోవచ్చు.